గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 23 మే 2018 (15:17 IST)

తూత్తుకుడి రక్తసిక్తం.. రేయ్.. ఒక్కడైనా చావాలి.. ఖాకీల కామెంట్స్ (Video)

తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లా రక్తసిక్తమైంది. ఇక్కడ స్థాపించన స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీని మూసివేయాలంటూ పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన మంగవారంతో వంద రోజులు పూర్తి

తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లా రక్తసిక్తమైంది. ఇక్కడ స్థాపించిన స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీని మూసివేయాలంటూ పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన మంగళవారంతో వంద రోజులు పూర్తిచేసుకుంది. దీన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అయితే, ఈ ర్యాలీ, నిరసనలు ఉద్ధృతమై ఘర్షణ వాతావరణనానికి దారితీసింది. దీంతో పోలీసు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 11 మంది మరణించారు. ఆపై జరిగిన పరిణామాల్లో మరికొందరు గాయపడ్డారు.
 
కలెక్టరేట్‌ను ధ్వంసం చేశారు. వందలాది సంఖ్యలో వాహనాలకు నిప్పుపెట్టారు. స్టెరిలైట్ ఉద్యోగులు నివశించే భవన సముదాయానికి నిప్పు పెట్టారు. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న వేళ.. బయటకు వచ్చిన ఓ వీడియో సంచలనం కలిగిస్తోంది. 
 
ఈ వీడియోలో తుపాకులతో కాల్చాలని కనీసం ఒక్కరన్నా చావాల్సిందేనని ఓ పోలీసు అంటున్న గొంతు వినిపిస్తోంది. 'కనీసం ఒక్కరైనా చనిపోవాల్సిందే' అంటున్న పోలీసు, ఆపై బుల్లెట్ ఫైరింగ్ శబ్దం వినిపిస్తోంది. అయితే, సదరు పోలీసు కాల్చిన బుల్లెట్ కారణంగా ఎవరైనా చనిపోయారా? లేదా? అనే విషయమై స్పష్టతలేదు. ఆ వీడియోను జాతీయ వార్తా సంస్థ 'ఏఎన్ఐ' బయటపెట్టింది. ఆ వీడియోనూ మీరూ చూడండి.