Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కోడిగుడ్లను ఉడకబెట్టి తింటే మేలెంత?

శనివారం, 2 డిశెంబరు 2017 (09:49 IST)

Widgets Magazine

కోడిగుడ్ల ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. కోడిగుడ్లలో వుండే పొటాషియం, విటమిన్ ఎ, కాల్షియం, ఐరన్, విటమిన్ డి, విటమిన్ బి6, విటమిన్ బి 12, మెగ్నిషియం,  శాచురేటెడ్ ఫ్యాట్లు, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు వుంటాయి. ఇవి శరీరానికి అందడం ద్వారా పలు అనారోగ్య సమస్యలు తలెత్తవు. రోజుకో కోడిగుడ్డును తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరిగినట్లేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
కోడిగుడ్లను ఉడకబెట్టి తింటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. అయితే ఉడికించిన కోడిగుడ్లను అప్పుడే తినేయడం మంచిది. గంటల పాటు బాక్సుల్లో వుంచి తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే.. ఉడికిన గుడ్డుపై బాక్టీరియా, వైరస్‌లు త్వరగా చేరి అవి కంటామినేట్ అవుతాయి. కనుక ఉడికిన గుడ్డును 3 గంటల్లోపే తినేయడం మంచిది. పొట్టు తీసిన బాయిల్డ్ ఎగ్స్‌ను ఒక్క రోజు కంటే ఎక్కువ ఫ్రిజ్‌లో నిల్వ వుంచకూడదు. 
 
ఒక కోడిగుడ్డును ఉకడబెట్టుకుని పచ్చ సొనతోపాటుగా తింటే రోజుకు ఒక గుడ్డు చాలు. ఒబిసిటీ వున్నవారు తెల్లసొన మాత్రమే తినాలి. దీంతో శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. ఇక మధుమేహం ఉన్నవారు వారానికి రెండు గుడ్లను తినవచ్చు. అది కూడా పచ్చ సొనతో కలిపి తినకుండా ఉంటే బెటరని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

గోధుమలు, జొన్నలు, రాగుల్ని పొట్టు తీయకుండానే?

బీరకాయ, చిక్కుడు, గోరుచిక్కుడు, ములగకాడలు, అరటిదూట, పనసకాయ వంటి పదార్థాలను వంటల్లో ...

news

మానసిక ఒత్తిడి నుంచి వెంటనే ఉపశమనం కోసం ఒక గ్లాస్ ఆ రసం...

పుదీనాలో చాలా ఔషధ గుణాలున్నాయి. పుదీనా ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ...

news

ఒక నిమ్మకాయ, కొద్దిగా నువ్వుల నూనెతో ఆ నొప్పి...

మానవ శరీరంలో మోకాళ్లనేవి నిస్సందేహంగా అత్యంత ముఖ్యమైనవి. నడవడం, జంప్, నిలబడటం వంటి సరైన ...

news

ఆస్తమా రోగులు తినాల్సినవి- తినకూడనివి

ఆస్తమా రోగులు చలికాలంలో పండ్లు తీసుకోవాలి. యాంటీ-యాక్సిడెంట్లు, బీటా కెరోటిన్ పుష్కలంగా ...

Widgets Magazine