శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 నవంబరు 2021 (14:30 IST)

విజయవాడలో బిల్డర్ దారుణ హత్య

విజయవాడలో ఓ బిల్డర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యతో బెజవాడ ఒక్కసారి ఉలిక్కిపడింది. ఇటీవల బిజినెస్ మ్యాన్ రాహుల్ మర్డర్ కేసును మరిచిపోక ముందే మరో హత్య జరిగింది. తాజాగా ఓ బిల్డర్‌ హత్య జరగడంతో విజయవాడవాసులు హడలిపోతున్నారు. 
 
బిల్డర్ అప్పలరాజు ఉంటున్న ఇంట్లోకి చొరబడిన దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న బిల్డర్‌ను తల పగల కొట్టి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. 
 
హత్య జరిగిన వెంటనే అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటన స్థలంలో క్లూస్ ఆధారాలు సేకరించే పనిలో పడింది. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బ‌ృందాలను ఏర్పాటు చేశారు
 
కేవలం వ్యాపార నిమిత్తం మాత్రమే అప్పల రాజు విజయవాడలోని వాంబే కాలనీలో ఉంటున్నారని వెల్లడించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.