నేను వైసిపిలో చేరుతున్నాగా... ఏపీలో కాంగ్రెస్ కనుమరుగేనా?

c ramachandraiah
జె| Last Modified శనివారం, 10 నవంబరు 2018 (20:43 IST)
టిడిపి - కాంగ్రెస్ కలయికతో ఒక్కసారిగా కొంతమంది సీనియర్ నేతల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఇప్పటికే కొంతమంది నేతలు పార్టీని వదిలి వచ్చేశారు కూడా. అందులో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య ఒకరు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఆయన వైసిపిలో చేరేందుకు సిద్థమైపోయారు. ఈనెల 13వ తేదీన వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
 
నేరుగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డితో సంప్రదింపులు జరిపిన సి.రామచంద్రయ్య ఆ పార్టీలో చేరేందుకు అనుమతి రావడంతో వెళ్ళేందుకు సిద్థమైపోయారు. సి. రామచంద్రయ్యను స్వయంగా జగన్ కండువా కప్పి వైసిపిలోకి ఆహ్వానించనున్నారు. ఈయనొకరే కాకుండా కాంగ్రెస్ పార్టీలోని మిగిలిన సీనియర్ నేతలు కూడా పార్టీని వదిలి వైసిపిలో చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.దీనిపై మరింత చదవండి :