బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 17 ఏప్రియల్ 2021 (20:18 IST)

ప్రశాంతంగా తిరుపతి ఉపఎన్నిక పోలింగ్: డీజీపీ గౌతం స‌వాంగ్‌

తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్ జగిందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. శనివారం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ..  తిరుపతి ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.

రాష్ట్ర పోలీస్ బలగాలతో పాటు 69 ప్లటూన్ల కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. సరిహద్దుల్లో బయట వ్యక్తులు, వాహనాలు రాకుండా కఠిన చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే సుమారు 250పైగా వాహనాలను తిప్పి పంపామన్నారు.

ఉద్దేశపూర్వకంగా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తారనే సమాచారంతో... అనుమానితులపై నిరంతర నిఘాను ఏర్పాటు చేశామని  డీజీపీ సవాంగ్ తెలిపారు. 33,966 మందిని బైండోవర్ చేశామన్నారు. 76 లక్షల నగదు, 6884 లీటర్ల మద్యం సీజ్, 94 వాహనాలు జప్తు  చేసినట్లు డీజీపీ సవాంగ్‌ పేర్కొన్నారు.