Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఓటుకు నోటు కేసు: ఆ గొంతు చంద్రబాబుదే.. ఫోరెన్సిక్ రిపోర్ట్‌.. కేసీఆర్ ఏమన్నారంటే?

మంగళవారం, 8 మే 2018 (09:10 IST)

Widgets Magazine

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆడియో టేపులో వినిపిస్తున్న గొంతు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుదేనని ల్యాబ్ పరీక్షల్లో తేలింది. నాలుగు రోజుల క్రితమే ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబ్ నివేదిక తెలంగాణ పోలీసులకు అందింది. సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. 
chandrababu
 
ఆ ఆడియో టేపులో వున్న గొంతు చంద్రబాబుదేనని తేలడంతో.. చట్టం ముందు అందరూ సమానమేనని.. కేసు విచారణలో ముందుకెళ్లండని అధికారులను కేసీఆర్ సూచించినట్లు సమాచారం. ఈ కేసులో జూలై 28, 2015న తొలి చార్జ్ షీట్ వేసిన ఏసీబీ, ఈ నెల చివరి వారంలో మరో చార్జ్ షీట్ వేయనున్నట్టు తెలిసింది. 
 
ఫోరెన్సిక్ నివేదిక వచ్చిందని తెలుసుకున్న కేసీఆర్.. ముందుగానే గవర్నర్ నరసింహన్‌ను కలిశారని.. కేసు గురించి కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పూర్తిస్థాయి చార్జ్ షీట్ దాఖలుకు జీఏడీ అనుమతి తీసుకోగా, గవర్నర్ కూడా అనుమతించడంతో రెండు వారాల్లోనే కోర్టు ముందు చార్జ్ షీట్ దాఖలు చేస్తామని ఏసీబీ అధికార వర్గాల సమాచారం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మోదుకూరులో దారుణం.. ఏడేళ్ల బాలికను రేప్ చేసిన 23యేళ్ల కామాంధుడు

గుంటూరు జిల్లా దాచేపల్లిలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన గురించి ఇంకా ఏ ఒక్కరూ ...

news

మోడీని దేశ ప్రధానిగా చేసి పశ్చాత్తాప పడుతున్నా : రాంజెఠ్మలానీ

ప్రధాని నరేంద్ర మోడీపై రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సీనియర్ క్రిమినల్ న్యాయవాది రాంజెఠ్మలానీ ...

news

ఆడబిడ్డల జోలికొస్తే సెక్సువల్ అఫెండర్ షీట్లు తెరుస్తాం : చంద్రబాబు హెచ్చరిక

ఆడబిడ్డల జోలికి వస్తే సెక్సువల్ అఫెండర్ షీట్లు తెరుస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ...

news

సమాఖ్య పరిరక్షణకే ఆర్థిక మంత్రుల సమావేశం... కేంద్రంపై టార్గెట్...

అమరావతి: సమాఖ్య వ్యవస్థ పరిరక్షణ కోసమే ఆర్థిక మంత్రుల సమావేశం ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ...

Widgets Magazine