గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 2 జూన్ 2018 (11:06 IST)

ప్రధాని మోదీని వేంకటేశ్వరుడే చూసుకుంటారు... చంద్రబాబు

నవ నిర్మాణ దీక్ష వేదిక నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. శ్రీ వెంకటేశ్వరుని పాదాల చెంత నిలబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాయం చేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారనీ, ఇచ్చిన మాట తప్పిన ప్రధానమం

నవ నిర్మాణ దీక్ష వేదిక నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. శ్రీ వెంకటేశ్వరుని పాదాల చెంత నిలబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాయం చేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారనీ, ఇచ్చిన మాట తప్పిన ప్రధానమంత్రి వ్యవహారాన్ని శ్రీ వేంకటేశ్వరుడే చూసుకుంటారని వ్యాఖ్యానించారు. 
 
వేంకటేశ్వర స్వామి అత్యంత శక్తివంతుడైన స్వామివారు అనీ, ఆయన పాదాల చెంత మాట ఇచ్చి తప్పితే తప్పకుండా తగిన శాస్తి జరిగి తీరుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలా అడ్రెస్ గల్లంతయ్యిందో అదే గతి వచ్చే ఎన్నికల్లో భాజపాకు కూడా పట్టబోతుందని జోస్యం చెప్పారు. అమరావతి నగర నిర్మాణానికి రూ. 1500 కోట్లు ఇచ్చి రూ. 2,500 కోట్లు ఇచ్చామని నరేంద్ర మోదీ, అమిత్ షాలు ఎలా చెపుతున్నారో అర్థం కావడంలేదన్నారు. 
 
తాము ఎంత మొత్తుకుంటున్నా తమ మాటలను పట్టించుకోవడంలేదనీ, ఏపీ ప్రజల ఉసురు తప్పక తగులుతుందన్నారు. ఇచ్చిన మాట తప్పే పార్టీలకు ఏపీ ప్రజలు బాగా బుద్ధి చెపుతారనీ, భాజపాకు కూడా అదే చేస్తారన్నారు.