మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 డిశెంబరు 2024 (09:58 IST)

Chandrababu Pawan kalyan : నెట్టింట వైరల్ అవుతున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ గుసగుసలు (video)

Pawan_Babu
Pawan_Babu
Chandrababu Pawan kalyan : విజయవాడలో జరిగిన స్వర్ణాంధ్ర-2047 ఆవిష్కరణ సందర్భంగా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేదికపై స్నేహపూర్వక సంభాషణలో పాల్గొంటూ, నవ్వుకోవడాలు.. మాట్లాడుకోవడాలు అందరినీ ఆకట్టుకుంది. 
 
పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చెవిలో ఏదో గుసగుసలాడుతుండటం కనిపించింది. పవన్ శ్రద్ధగా విని చిరునవ్వుతో ప్రతిస్పందించారు. ఒకానొక సమయంలో, పవన్ కళ్యాణ్ సరదాగా ముఖ్యమంత్రి చేయి పట్టుకుని మాట్లాడటం కూడా ఉత్సాహభరితమైన వాతావరణాన్ని పెంచింది.
 
 వీడియో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.