సోమవారం, 13 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 డిశెంబరు 2024 (19:38 IST)

Pawan Kalyan: హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్.. నమ్మలేకపోతున్నానన్న రష్మిక

Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. మరికాసేపట్లో ఆయన హైదరాబాద్‌కు చేరుకుని అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. సంధ్యా థియేటర్ ఘటన, అరెస్టు గురించి బన్నీ టీమ్‌ని అడిగి వివరాలు తెలుసుకోనున్నారు పవన్. 
 
మరోవైపు ఇప్పటికే మెగా ఫ్యామిలీ సభ్యులు అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించారు. కాగా, తాజాగా అల్లు అర్జున్ ఇంటికి పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్, హీరో దగ్గుబాటి రాణా చేరుకున్నారు. 
 
ఇకపోతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు పోలీసులు అతన్ని చంచల్ గూడ జైలుకు తరలించే ప్రయత్నం చేశారు. కాగా, అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. వాదోపవాదనల నడుమ అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
 
అల్లు అర్జున్ అరెస్టుపై స్పందిస్తూ, పుష్ప-2 నటి రష్మిక మందన్న దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. "నేను చూస్తున్నది నిజమేనా... నేను నమ్మలేకపోతున్నాను" అని ఆమె రాసింది. ఈ సంఘటనను దురదృష్టకరం, తీవ్ర విచారకరం అని రష్మిక అభివర్ణించింది. కానీ ఒకే ఒక వ్యక్తిని బాధ్యులుగా ఉంచడం బాధాకరమని చెప్పుకొచ్చింది.