మరో 10 ఏళ్లు సీఎంగా చంద్రబాబు వుండాలి: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ది సాధించాలంటే మరో దశాబ్ద కాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వుండాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఆయన విజన్ కు అనుగుణంగా మేమంతా పనిచేస్తామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలందరూ ఏపీ అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మరో పదేళ్లు పనిచేయాన్నది తన ఆకాంక్ష అని అన్నారు.
బోరుగడ్డకు రాచమర్యాదలు, పోలీసు అధికారిపై వేటు
నేరం చేసినవాడికి పోలీసు స్టేషనులో ఇంతగా రాచమర్యాదలు జరుగుతాయా? పైగా అతను ఓ రౌడీషీటర్. బోరుగడ్డ అనిల్. ఈ పేరు గురించి పరియం అక్కర్లేదు. గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్‌లో విచారణ సమయంలో బోరుగడ్డ టీ అడగగానే అందించడం.. కుర్చీ వేసి కబుర్లు చెప్పడం వంటి అంశాలు అక్కడి సీసీ కెమేరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటంతో పోలీసు అధికారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఓ నేరస్తుడికి, రౌడీ షీటర్ కి పోలీసు స్టేషనులో ఇంతగా మర్యాదలు చేస్తారా అంటూ ప్రజలు విస్తుపోతున్నారు. దీనితో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. బోరుగడ్డ అనిల్ వ్యవహారంపై పోలీసు స్టేషన్‌లోని కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యంపై వివరణ ఇవ్వాలని జిల్లా ఐజీ ఆదేశాలు చేసారు. బోరుగడ్డ అనిల్ విచారణ సమయంలో నిర్లక్ష్యం వహించిన మరో అధికారిపై చర్యలకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. విధులు సరిగ్గా నిర్వర్తించడంలో నిర్లక్ష్యంగా ఉన్న ఉన్నతాధికారిపై చర్యలు తీసుకునేందుకు గుంటూరు జిల్లా ఐజీ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.