జనం పైకి ఉరికిన చిరుతపులి... చూడండి వీడియో...

Cheetah
జె| Last Modified శుక్రవారం, 28 డిశెంబరు 2018 (19:08 IST)
వ్యవసాయ పొలాల వద్ద ప్రత్యక్షమైన చిరుతను చూసేందుకొచ్చిన జనంపై ఒక్కసారిగా చిరుత దాడి చేయడంతో ఐదుగురు గాయపడ్డారు. ఈ సంఘటన కుప్పం సరిహద్దులోని తమిళనాడు రాష్ట్రం వాణీయంబాడీ సమీపంలోని చిక్కనాకుప్పం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల వద్ద చోటుచేసుకుంది. వాణీయంబాడీ సమీపంలోని చిక్కనాకుప్పం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల వద్ద గురువారం ఉందయం చిరుత ప్రత్యక్షమైంది.

దీనితో చిరుతను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే 2 గంటల ప్రాంతంలో ఇక్కసారిగా చిరుత జనంపైకి రావడంతో భయంతో పరుగులు తీశారు. పరుగులు తీస్తున్న వారిపై చిరుత దాడి చేసి గాయపరచింది. చిరుత దాడిలో అలివేలు, కమల్‌తో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు.

క్షతగాత్రులను వాణీయంబాడీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫారెస్ట్ అధికారులు చిరుత కోసం గాలిస్తున్నారు. చిరుతను పట్టుకునేందుకు 20 మంది సిబ్బందిని నియమించినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అది మాత్రం ఇంతవరకూ జాడ లేకుండా పోయింది. చూడండి వీడియో...దీనిపై మరింత చదవండి :