రాజమండ్రి యువతులను మింగేసిన చెన్నై రోడ్డు ప్రమాదం... 25 రోజులకే...

road accident
Last Updated: మంగళవారం, 16 జులై 2019 (19:42 IST)
ఎన్నో ఆశలతో చెన్నై మహానగరంలో అడుగుపెట్టిన ఆ యువతులకు చెన్నై రోడ్డు ప్రమాదం రూపంలో పొట్టనబెట్టుకుంది. మంగళవారం చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌, రాజమండ్రికి చెందిన ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో యువకుడి పరిస్థితి ఆందోళనకరంగా వుంది.

ప్రాణాలు కోల్పోయిన యువతులు పావని(21), నాగలక్ష్మి(21)గా గుర్తించారు. వీరిద్దరూ 22 ఏళ్ల శివ మోటారు బైకుపై ఎక్కారు. ముగ్గురూ కలిసి ఒకే బైకుపై వెళ్తుండగా హఠాత్తుగా మరో బైక్ హ్యాండిల్ తగిలి బ్యాలెన్స్ తప్పింది.

బైక్‌తో పాటు ముగ్గురూ కిందపడిపోవడంతో వారి పైనుంచి వెనుకే వస్తున్న బస్సు వెళ్లింది. దాంతో ఇద్దరు యువతులు అక్కడికక్కడే మృతి చెందారు. శివకి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాద దృశ్యం సీసీ కెమేరాలో రికార్డయ్యింది.దీనిపై మరింత చదవండి :