రికార్డింగ్ డ్యాన్సులకు అడ్డొస్తుందనీ... కన్నబిడ్డను చంపేసింది

బుధవారం, 6 డిశెంబరు 2017 (14:05 IST)

murder

రికార్డింగ్ డ్యాన్సులకు అడ్డొస్తుందని భావించిన ఓ కసాయి తల్లి తన రెండేళ్ళ బిడ్డను హత్య చేసింది. ఈ హత్యకు ఆమె ప్రియుడు కూడా సహకరించాడు. ఈ దారుణం చిత్తూరు జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన శాంత (22) అనే మహిళ ఓ రికార్డింగ్ డ్యాన్సర్. నాలుగేళ్ల క్రితం బోయకొండ శ్రీనివాసులు అనే యువకుడిని పెళ్లాడింది. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు. ఆ తర్వాత అతన్ని వదిలేసి, మదనపల్లికి చెందిన డాన్స్ గ్రూపులో చేరి, అదే గ్రూపులో డ్యాన్సులు చేసే శ్రీనివాసులుతో సహజీవనం సాగిస్తోంది.
 
వీరిద్దరూ గ్రామాల్లో పండగలు, పబ్బాలకు జరిగే రికార్డింగ్ డ్యాన్సుల్లో పాల్గొంటూ, తద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గత నెల 23వ తేదీన పుంజనూరు మండలం గాలిమిట్టకు వెళ్లిన ఇద్దరూ, తమ వెంట జ్వరంతో బాధపడుతున్న రెండేళ్ల కుమార్తె శివానిని కూడా తీసుకెళ్లారు. ఆపై మద్యం తాగి, ఒళ్లు తెలియకుండా డ్యాన్సులు వేస్తున్నారు. 
 
ఆ సమయంలో జ్వరంతో బాధపడుతున్న బిడ్డ ఏడుపు వినిపించింది. అంతే, ఒక్కసారిగా శాంతకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పాపను చంపేయాలని తన ప్రియుడిని కోరింది. వెంటనే శ్రీనివాసులు ఆ చిన్నారి గొంతు పిసికి, ఆటో కమ్మీకి బలంగా కొట్టగా, ఆ పాప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత మృతదేహానికి దుప్పటి చుట్టి మురుగు కాలువలో పడేశారు. 
 
ఈ విషయం మరుసటి రోజు వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో శాంతతో పాటు.. ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మళ్లీ పవన్ మద్దతిస్తేనే... లేదంటే జగన్ మోహన్ రెడ్డే కింగ్... లగడపాటి సర్వే

ఎపిలో సర్వేలు ఎవరైనా చేయిస్తున్నారంటే అది లగడపాటి రాజగోపాల్ అని ఠక్కున చెప్పేస్తుంటారు. ...

news

విమర్శిస్తే బెదిరిస్తారా... ఏం పీకుతారు మీరు? : పాలకులకు పవన్ ప్రశ్న

ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తి చూపి, ప్రభుత్వ పాలనా తీరును విమర్శిస్తే బెదిరిస్తారా? ఏం ...

news

సహచర విద్యార్థినిపై ఆరు మానవ మృగాలు ఇలా ప్రవర్తించాయి (వీడియో)

కళాశాల విద్యార్థులు నీచంగా ప్రవర్తించారు. ఒడిశాలో కొందరు విద్యార్థులు సహచర విద్యార్థినిని ...

news

#BabasahebAmbedkar : రాజ్యాంగ నిర్మాతకు పవన్ కళ్యాణ్ సెల్యూట్

భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్‌.అంబేడ్కర్ వర్థంతి సందర్భంగా జనసేన పార్టీ అధినేత, హీరో ...