జగన్‌తో కలిసి ముందడుగు-పోసాని బాటలో చోటా కే నాయుడు

సినీ నటుడు పోసాని కృష్ణమురళి, విలక్షణ నటుడు పృథ్వీ పాదయాత్రలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసి మద్దతు పలికిన సంగతి తెలిసిందే. వీరి కోవలోనే ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ చోటా కే నాయుడు వైఎస్‌ జగన్‌ను

selvi| Last Updated: సోమవారం, 9 జులై 2018 (18:13 IST)
సినీ నటుడు పోసాని కృష్ణమురళి, విలక్షణ నటుడు పృథ్వీ పాదయాత్రలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసి మద్దతు పలికిన సంగతి తెలిసిందే. వీరి కోవలోనే  ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ చోటా కే నాయుడు వైఎస్‌ జగన్‌ను కలిశారు. సోమవారం, మండపేట నియోజకవర్గం సోమేశ్వరంలో జరుగుతున్న ప్రజాసంకల్పయాత్రలో జననేతను కలిసి తమ మద్దతును తెలియచేశారు. 
 
ఈ సందర్భంగా చోటా కే నాయుడు  మాట్లాడుతూ.. రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. పాదయాత్రలో జగన్‌తో కలిసి ముందడుగు వేసిన చోటా కె నాయుడు, ఆయనతో నడుస్తూనే పలు విషయాలు చర్చించారు. 
 
తాను వైఎస్‌ జగన్‌కి హార్డ్‌కోర్‌ ఫ్యాన్‌ననీ, అదే విషయాన్ని ఆయనకి చెప్పాననీ, కుట్రలతో జైల్లో పెట్టినా జగన్‌ ఏమాత్రం తొణకకుండా, ప్రజలకు ఇచ్చిన మాటమేరకు.. ప్రజల కోసం పోరాడుతున్నారని చోటా కె నాయుడు చెప్పారు. జగన్‌లో ఓపిక, సహనం తనను ఆకట్టుకున్నాయని చెప్పుకొచ్చారు.  ఇక జగన్ ప్రజా సంకల్ప యాత్రకు తూర్పు గోదావరి జిల్లా ప్రజల నుంచి పూర్తి మద్దతు, ఆదరణ లభిస్తుంది.దీనిపై మరింత చదవండి :