గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (08:14 IST)

వైకాపా కార్యకర్త వివాహానికి హాజరైన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తున్నారు. తాడేపల్లి నివాసం విడిది వదిలి రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి చెక్ పెడుతూ వైకాపా కార్యకర్త వివాహానికి ఆయన హాజరై, ప్రతి ఒక్కరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. 
 
విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటరులో వైకాపా కార్యకర్త ప్రశాంత్ వివాహం శరణ్య అనే యువతితో జరిగింది. ఈ వివాహానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్‌ను ఆహ్వానించారు. 
 
ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి ఆయన హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను వైకాపా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.