సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (12:55 IST)

శ్రీ శారదా పీఠం వార్షిక బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్.. రాజశ్యామల యాగంలో?

శ్రీ శారదా పీఠం వార్షిక ఉత్సవాల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. శ్రీ శారదా పీఠం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాజశ్యామల యాగంలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. గత కొన్నేళ్లుగా విశాఖపట్నం శ్రీ శారదా పీఠం వార్షిక ఉత్సవాలకు సీఎం జగన్‌ నిత్యం హాజరవుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ ఏడాది వార్షికోత్సవాల్లో భాగంగా బుధవారం విశాఖపట్నం వెళ్లనున్నారు. సీఎం పురస్కరించుకుని పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది.
 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుని రోడ్డు మార్గంలో నేరుగా చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠానికి చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు వార్షిక ఉత్సవాల్లో పాల్గొని.. అక్క‌డి నుంచి మధ్యాహ్నం 1:25 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు.