మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 3 ఏప్రియల్ 2021 (14:03 IST)

సీఎం జగన్ బెయిల్ పైన వున్నారు, ఎప్పుడైనా జైలుకెళ్లొచ్చు: బిజెపి నేత సంచలన వ్యాఖ్యలు

అసలే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైన ఉన్నారు. ఆ ఏ క్షణంలోనైనా జైలుకు వెళ్ళొచ్చు. ఆయన బెయిల్ రద్దు కూడా కావచ్చు. నేరుగా అత్తారింటికే వెళ్ళిపోతారు జగన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బిజెపి జాతీయ కార్యదర్సి సునీల్ దీయోధర్.
 
తిరుపతి వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారాయన. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తులతో ఉప ఎన్నికలపై సమావేశమయ్యారు సోము వీర్రాజు, సునీల్ దీయోధర్. కాపు కులస్తులందరూ బిజెపి-జనసేన వైపే ఉన్నారన్నారు సునీల్. సిఎం పనైపోయింది.. ఎపిలో ప్రత్యామ్నాయ పార్టీ బిజెపి-జనసేన మాత్రమేనన్నారు.
 
జగన్ హయాంలో రాష్ట్రం సర్వనాశనమైందనీ, అవినీతి.. అప్పులే మిగిలాయన్నారు. బిజెపి-జనసేన మాత్రమే ఎపిని బంగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చగలవన్నారు సునీల్. ఉప ఎన్నికల్లో రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు పేలుతుంటే.. తాజాగా సునీల్ చేసిన వ్యాఖ్యలు మరింత హాట్ హాట్‌గా మారుతున్నాయి.