గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2017 (11:46 IST)

మాటతప్పం.. మడమతిప్పం... లక్ష ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం : కేసీఆర్

మాటతప్పం.. మడమతిప్పం.. ఇదే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మాట. ఇపుడు ఈ నినాదాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకున్నారు. గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు లక్ష ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని ఆ

మాటతప్పం.. మడమతిప్పం.. ఇదే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మాట. ఇపుడు ఈ నినాదాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకున్నారు. గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు లక్ష ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కేసీఆర్ మాట్లాడుతూ... దళిత, బలహీనవర్గాలు, మైనార్టీలకు సమప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు 20 లక్షలకుపైగా ఇస్తున్నామన్నారు. నిర్మాణాత్మక పంథాలో సూచనలు చేయాలని సభ్యులను కోరారు. టీఎస్ పీఎస్సీ ఛైర్మన్‌గా ఉన్న ఘంటా చక్రపాణి పనితీరు హర్షణీయమన్నారు. ఆయన గౌరవాన్ని తగ్గించే విధంగా సభ్యులు మాట్లాడటం తగ్గదన్నారు. 
 
దేశంలో కొత్త రాష్ట్రంగా వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. చక్రపాణిని యూపీఎస్సీ ప్రత్యేకంగా అభినందించిందన్నారు. యూపీఎస్సీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఎంపికచేసిందన్నారు. ఆయనను అవమాన పరచొద్దు అని కోరారు. విద్యార్థులను రెచ్చగొట్టేలా పాత రాజకీయాలు చేస్తున్నారన్నాయని ప్రతిపక్షాలను విమర్శించారు. వాస్తవాలు బయటకు వస్తాయని…. అవాస్తవాలు చెప్పొద్దని.. సోషల్ మీడియా ద్వారా నిజాలు బయటకు పోతున్నాయన్నారు.
 
గోల్కొండ ఉపన్యాసంలో అన్నమాట ప్రకారం లక్షా 12 వేలు ఉద్యోగాలు కల్పిస్తామని… దానికంటే వెయ్యి ఉద్యోగాలు ఎక్కువగా ఇస్తామన్నారు. ఆవాసీయ విద్య లక్షా 20 వేల రూపాయలు ఖర్చుపెట్టే విధానాన్ని తీసుకొచ్చామన్నారు. కేంద్రంలో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారనీ గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ నిధులపై పైసా పైసా వివరాలు తెలిసేలా పెన్ డ్రైవ్ ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.