శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 23 జూన్ 2018 (15:19 IST)

జనసేనలోకి నాదెండ్ల మనోహర్... పవన్‌తో కీలక మంతనాలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా పని చేసిన నాదెండ్ల మనోహర్ శనివారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని పవన్ నివాసంలో ఈ సమావేశం జరిగింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా పని చేసిన నాదెండ్ల మనోహర్ శనివారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని పవన్ నివాసంలో ఈ సమావేశం జరిగింది.
 
వీరిద్దరూ సుమారు అర్థగంట సేపు చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో నాలుగు రోజుల క్రితమే నాదెండ్ల మనోహర్‌తో పాటు, ఇతర ఏపీ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించారు. 
 
ఇంతలోనే పవన్‌తో మనోహర్ భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వివిధ అంశాలతో పాటు, ఏపీలో నెలకొన్న పరిస్థితులపై వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం. పైగా, ఈయన జనసేన పార్టీలో చేరవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. 
 
కాగా, రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు మనోహర్ దూరంగా ఉన్న విషయం తెల్సిందే. ఈయన తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు ఏపీ ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు.