Widgets Magazine

తెరాస సర్కారుకు గవర్నర్ చెక్కభజన చేస్తున్నారు : వీహెచ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న ఈఎస్ఎల్ నరసింహన్ చెక్క భజన చేస్తున్నారనీ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్ర విమర్శలు చేశారు.

V Hanumantha rao
pnr| Last Updated: ఆదివారం, 21 జనవరి 2018 (15:07 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న ఈఎస్ఎల్ నరసింహన్ చెక్క భజన చేస్తున్నారనీ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అవినీతిలో గవర్నర్‌కు భాగస్వామ్యం ఉందని, ఇకపై అవినీతి కేసులో గవర్నర్‌నూ విచారించాల్సి వస్తుందని, నరసింహన్‌ని తాము విడిచిపెట్టమని వీహెచ్ హెచ్చరించారు. నాడు తెలంగాణలో రైతులకు సంకెళ్లు వేస్తే మాట్లాడని గవర్నర్, టీఆర్ఎస్ భజన చేస్తున్నారంటూ మండిపడ్డారు.

అలాగే, మరో సీనియర్ నేత భట్టి విక్రమార్క కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్‌భవన్‌ను తెరాస భవన్‌గా మార్చివేశారంటూ మండిపడ్డారు. రాజ్యాంగాన్ని, రాజ్‌భవన్‌ను నరసింహన్ అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. నరసింహన్ వ్యవహారశైలితో గవర్నర్ వ్యవస్థకే అపకీర్తి వస్తోందని విమర్శించారు. కాళేశ్వరంపై గవర్నర్ తీరు విచిత్రంగా ఉందని అన్నారు. కేసీఆర్, హరీష్‌ల పేర్లు మాత్రమే మార్చినందుకు సంతోషంగా ఉందని... మరిచిపోయి రాజ్‌భవన్ పేరును కూడా టీఆర్ఎస్ భవన్‌గా మార్చేస్తారేమో అంటూ ఎద్దేవా చేశారు.
అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు పేరు మార్పుపై ఎందుకు ప్రశ్నించలేదని భట్టి అన్నారు. రూ.20 వేల కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు బడ్జెట్ ఎందుకు పెరిగిందో ప్రశ్నించారా? అని మండిపడ్డారు. ఆహా, ఓహో అంటూ పొగిడేముందు... ఆ ప్రాజెక్టును ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు.


దీనిపై మరింత చదవండి :