బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 5 ఆగస్టు 2020 (09:27 IST)

ఏపీలో ఆర్టీసీ సిబ్బందికి కరోనా దెబ్బ

ఏపీలో ఆర్టీసీని కరోనా వణికిస్తోంది. ఆ సంస్థకు చెందిన వందలాది మంది ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 1187 మంది కొవిడ్‌ బారిన పడినట్లు, 18 మంది మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు.

కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజా రవాణా ప్రారంభం కాగానే ఈయూ, ఎన్‌ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ కార్మిక సంఘాలు యాజమాన్యానికి, ప్రభుత్వానికి కొన్ని వినతులిచ్చాయి. సిబ్బందికి కొవిడ్‌ వస్తే మెరుగైన వైద్యం అందించాలని, ఎవరైనా మరణిస్తే 50లక్షల బీమా వర్తింపజేయాలని కోరాయి.

అందుకు అనుగుణంగా జూలై 15న ఆర్టీసీ యాజమాన్యం అన్ని డిపోల మేనేజర్లు, ఆర్‌ఎంలు, ఈడీలకు సర్క్యులర్‌ జారీ చేసింది. పీటీడీ సిబ్బంది ఎవరికి కరోనా సోకినా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంపిక చేసిన అన్ని రెఫరల్‌ ఆసుపత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందించాలని ఆదేశించింది.