మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (20:30 IST)

భారత్‌లో కరోనా విశ్వరూపం... 24 గంటల్లో 1463 కేసులు

భారత్‌లో కరోనా మెల్లగా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గత 24 గంటల్లో ఏకంగా 1463 కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అలాగే 29 మంది మణించారు. 
 
కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ మేరకు.. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయానికి భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 10,815గా నమోదైంది. క్రియాశీలకంగా ఉన్న కేసుల సంఖ్య 9,272 కాగా, 1,189 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 353 మంది మరణించారు. 
 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, గుంటూరు జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. ఈ జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 109కి చేరింది. గుంటూరు అర్బన్‌లో 85, రూరల్‌లో 24 కేసులు నమోదయ్యాయని, 1800 మందికి పరీక్షలు నిర్వహించామని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ వైరస్ బారినపడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.