శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 మార్చి 2021 (18:45 IST)

ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. వెయ్యికి దగ్గర్లో కోవిడ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 997 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,99,812కు చేరింది. 
 
ఇందులో 8,86,498 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 6,104 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో ఐదుగురు మరణించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 7,210 కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 282 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
 
కరోనా కేసుల ఉధృతి పెరిగిన నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు. వైరస్‌ను లైట్ తీసుకోవద్దని, అది మరోసారి విజృంభిస్తే ప్రమాదకర పరిస్థితులు తప్పవని హెచ్చరిస్తున్నారు.