సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 30 ఆగస్టు 2021 (19:07 IST)

ఆర్డీఓ చేతులు నరుకుతాం: నారాయణ సంచలన వ్యాఖ్యలు

ఎల్లప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ సంచలనానికి మారుపేరుగా నిలిచిన సిపిఐ జాతీయ కార్యదర్సి నారాయణ మరోసారి అలాంటి పనే చేశారు. ఈసారి ఏకంగా ప్రభుత్వ మహిళా అధికారిణి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీస్తోంది.
 
చిత్తూరు-పర్చూరు జాతీయ రహదారి నిర్మాణం కోసం రైతుల భూములను ప్రభుత్వం తీసుకుంటోంది. దీంతో సిపిఐ నారాయణకు చెందిన ఒకటిన్నర ఎకరం స్థలం కూడా పోతోంది. 
 
నష్టపరిహారం ఎక్కువగా ఇవ్వాలని సిపిఐ నారాయణ అధికారులను కోరారు. పంటలు పండించుకునే పొలాన్ని లాక్కోవడం సరైంది కాదంటూ రైతులతో కలిసి పాదయాత్ర చేశారు.
 
నేరుగా చిత్తూరు ఆర్డీఓను కలిశారు సిపిఐ నారాయణ. చిత్తూరు ఆర్డీఓ రేణుక. అయితే ఆమె నుంచి సరైన సమాధానం రాకపోవడంతో సిపిఐ నారాయణకు కోపమొచ్చింది. రైతుల భూములను బలవంతంగా ఆర్డీఓ లాక్కోవాలని చూస్తున్నారని.. ఆమె చేతులను నరకడానికైనా రైతులు వెనుకడుగు వేయరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
చిత్తూరు ఆర్డీఓ ప్రభుత్వ అధికారిణిగా కాకుండా డాన్‌గా మారిపోయారంటూ మండిపడ్డారు. తన స్థలానికే దిక్కు లేకుంటే మిగిలిన రైతుల పరిస్థితి ఏంటంటూ ప్రశ్నించారు సిపిఐ నారాయణ.