సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 7 ఆగస్టు 2021 (16:27 IST)

వైసిపి ప్రభుత్వం కూలిపోతుంది, జగన్ పైన సునీల్ థియోధర్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పైన, వైసీపీ ప్రభుత్వంపైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్. వైసీపీ ప్రభుత్వం ఏక్షణమైనా కూలిపోతుందన్నారు. బెయిల్ రద్దవుతుందన్న భయంతో జగన్ ఉన్నారన్నారు.
 
వైసీపీ ప్రభుత్వాన్ని మేము కూల్చాల్సిన అవసరం లేదు. ఆ ఆలోచన కూడా మాకు లేదు అంటూ ట్వీట్ చేశారు సునీల్ థియోధర్. రోజు గడపడానికి అప్పులు పుట్టక రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టి అది చాలదన్నట్లు వేల కోట్ల అవినీతి చేసి మీ ప్రభుత్వాన్ని మీరే పాతాళమంత లోతు గొయ్యి తవ్వి రెడీగా ఉంచారు. 
 
మీ పతనానికి మీరే కారకులవుతారు. మాకేం సంబంధం లేదు అంటూ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు ధీటుగా సునీల్ దియోధర్ సమాధానమిచ్చారు. ఇప్పుడిదే రెండు పార్టీల మధ్య పెద్ద చర్చకు దారితీస్తోంది.