గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (10:33 IST)

డబ్బుల కోసం బెదిరింపులు.. యువతులతో పరిచయం.. ఆపై ఫోటోలు తీసి..

డబ్బుల కోసం ఫోటోలు బయటపెడతామంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్న ముగ్గురు యువతులపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే... మాదాపూర్‌‌కు చెందిన ద్వారకానాథ్ రెడ్డికి ఎల్లారెడ్డిగూడకు చెందిన ముగ్గురు యువతులతో పర

డబ్బుల కోసం ఫోటోలు బయటపెడతామంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్న ముగ్గురు యువతులపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే... మాదాపూర్‌‌కు చెందిన ద్వారకానాథ్ రెడ్డికి ఎల్లారెడ్డిగూడకు చెందిన ముగ్గురు యువతులతో పరిచయం ఏర్పరుచుకున్నాడు. ఈ పరిచయాన్ని ఆసరాగా తీసుకుని యువతులను అతడు బ్లాక్ మెయిల్ చేశాడు. 
 
యువతులను రహస్యంగా ఫోటోలు తీసి.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానంటూ బెదిరించాడు. డబ్బుల కోసం వేధించాడు. ఇప్పటికే పెద్ద మొత్తాన్ని ఆ యువతుల నుంచి తీసుకున్న ద్వారకానాథ్ వేధింపులు తాళలేక యువతులు బాంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు.