Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రియుడి కోసం బడాబాబును పెళ్లి చేసుకుంది.. చివరికి ఏం చేసిందంటే?

మంగళవారం, 30 జనవరి 2018 (15:53 IST)

Widgets Magazine
love story

జల్సాకు అలవాటు పడి ఓ యువతి దొంగతనాలు చేస్తూ దొరికిపోయింది. తాను వలచిన యువకుడిని వివాహం చేసుకునేందుకు ఓ బడాబాబును వివాహం చేసుకుని.. అతని ఇంట్లో నుంచి ఒక్కో వస్తువును దోచుకునేది. ఇలా ఇంట్లోనే దొంగతనానికి పాల్పడిన యువతిపై భర్తకు అనుమానం వచ్చి.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన పావని (28)కి హైదరాబాద్, అంబర్ పేటలో ఉండే కిషోర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కిషోర్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్న పావని.. అతనికి ఆర్థికంగా సహకరించేది. ముంబైలో సట్టా నిర్వహించే కిషోర్ కోసం అప్పుడప్పుడు ఆమె ముంబైకి వెళ్లేది. 
 
గతంలో టర్కీ కరెన్సీని సరఫరా చేస్తూ పావని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో కొత్త ప్లాన్ వేసింది. ఆర్థికంగా బాగా స్థిరపడిన బడాబాబు రమేష్ అనే యువకుడిని పెళ్లి పేరిట నమ్మించింది. వివాహం కూడా చేసుకుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న రమేష్‌కు దక్షిణాఫ్రికాలో జాబ్ కూడా వచ్చింది. 
 
ఇక రమేష్ ఇంట్లోని వస్తువులను దొంగలించి ప్రియుడికి ఇచ్చేది. ఈ విషయం తెలుసుకున్న రమేష్ కుటుంబీకులు ఇంటి నుంచి గెంటేసినా.. మోసాలకు బ్రేక్ వేయకపోవడంతో ఉష అనే యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పావనిని అరెస్ట్ చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Hyderabad Vijayawada Pavani Ambarpeta Crime News

Loading comments ...

తెలుగు వార్తలు

news

గన్‌ తీసుకొని గర్ల్‌ఫ్రెండ్‌తో వీడియో కాల్‌.. తర్వాత ఏమైంది..

యువతీయువకులు తమ వెర్రి చేష్టలతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. సెల్ఫీలు, వీడియోకాల్‌లు ...

news

చైనా సరిహద్దును దాటేసిన ఏనుగు (video)

చైనా సరిహద్దును సునాయాసంగా ఏనుగును దాటేసింది. దేశ సరిహద్దులు దాటడం అంత సామాన్యమైన విషయం ...

news

రాత్రంతా ఒకటే చాటింగ్- భార్య ఫిర్యాదు.. నటుడు సామ్రాట్‌ అరెస్ట్.. సీసీటీవీ కెమెరాలో?

స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో ఇంటికొచ్చినా చాలామంది కుటుంబాన్ని, భార్యను పట్టించుకోకుండా ...

news

పవన్ రాజకీయాల్లోకి వెళ్ళడం ఇష్టంలేని సన్నిహితుడు ఎవరో తెలుసా?

నర్రా శ్రీనివాస్ అంటే మనకు గుర్తుకు వచ్చేది 'గబ్బర్ సింగ్' సినిమా. ఈ సినిమాలో పవన్ ...

Widgets Magazine