Widgets Magazine

తమన్నాకు చేదు అనుభవం.. బూటు విసిరాడు.. జస్ట్ మిస్

ఆదివారం, 28 జనవరి 2018 (16:04 IST)

బాహుబలి సినిమా తర్వాత తమన్నా ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్‌లతో బిజీగా గడుపుతోంది. తెలుగులో నా నువ్వే, క్వీన్ వన్స్ ఎగైన్ చిత్రాల్లో నటిస్తోంది. ఆమె నటించిన తమిళ మూవీ స్కెచ్ ఇటీవల విడుదలైంది. హిందీలో కామోషి, మరాఠిలో ఎబిసి చిత్రాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అందాల ముద్దుగుమ్మ, తెల్లపిల్ల తమన్నాకు చేదు అనుభవం ఎదురైంది 
 
హైదరాబాద్ హిమాయత్ నగర్‌లో మలబార్ గోల్డ్ షాప్ ప్రారంభోత్సవం నిమిత్తం వచ్చిన ఆమెపై ఓ యువకుడు బూటు విసిరాడు. తమ నిరసన తెలుపుతూ ప్రముఖులపై బూటు విసరడం ఫ్యాషనైపోయింది. అలాగే తమన్నా వెళ్లిన కార్యక్రమానికి భారీ స్థాయిలో అభిమానులు తరలివచ్చారు. . దీంతో, తమన్నాను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అయితే బౌన్సర్లు వారిని కంట్రోల్ చేశారు. 
 
ఈ క్రమంలో అభిమానులకు తమన్నా అభివాదం చేస్తుండగా ఓ యువకుడు ఆమెపై బూటు విసిరాడు. అయితే, అతను విసిరిన బూటు, ఆమెకు కొంత దూరంలో పడింది. దీంతో, అతనిపై బౌన్సర్లు చేయి చేసుకున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. 
 
కాగా, తమన్నాపై షూ విసిరిన వ్యక్తి పేరు కరీముల్లా అని సమాచారం. ఈ మధ్య తమన్నా సినిమాలు సరిగ్గా వుండట్లేదని.. ఆ కోపంతో తమన్నాపై బూటు విసిరానని కరిముల్లా పోలీసులకు తెలిపినట్లు వార్తలొస్తున్నాయి.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

తమన్నాకు చేదు అనుభవం.. బూటు విసిరాడు.. జస్ట్ మిస్

బాహుబలి సినిమా తర్వాత తమన్నా ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్‌లతో బిజీగా గడుపుతోంది. ...

news

పొటాటో, క్యారెట్ కట్ చేస్తే ఒత్తిడి మాయం: ఉపాసన వార్నింగ్

పొటాటో, క్యారెట్ కట్ చేస్తే ఒత్తిడి దూరమవుతుందని ట్విట్టర్ ద్వారా వీడియో సందేశాన్ని ఉపాసన ...

news

''సైరా'' నుంచి బిగ్ బి తప్పుకున్నారా? చిరంజీవి లుక్ ఇలా వుంటుందా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. త్వరలో ...

news

మెగా ఫ్యామిలీ నటవారసుడు ఆ హీరో : బాలకృష్ణ

మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్‌పై హీరో బాలకృష్ణ ప్రశంసల వర్షం కురిపించారు. సాయిధరమ్‌ ...

Widgets Magazine