Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సెల్ఫీ వీడియో పిచ్చి.. ట్రైన్ వస్తుండగా ఫోజు.. తలకు, చేతికి తీవ్ర గాయాలు.. (వీడియో)

బుధవారం, 24 జనవరి 2018 (18:14 IST)

Widgets Magazine

యువతకు సెల్ఫీల పిచ్చి బాగా ముదిరింది. సెల్ఫీలపై మోజుతో, లైక్స్, షేర్ల పిచ్చితో ప్రాణాలను కోల్పోతున్నారు. దేశంలో సెల్ఫీలతో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరిగిపోతూ వుంది. తాజాగా భరత్ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. సెల్ఫీ వీడియో కోసం ప్రయత్నించి ఓ యువకుడు తీవ్రంగా గాయాలపాలైనాడు. 
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని భ‌ర‌త్ న‌గ‌ర్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలో ఓ యువ‌కుడు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించాడు. రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్న శివ అనే యువకుడు తన సెల్ ఫోన్లో సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. సెల్ఫీ వీడియో కోసం ఫోన్‌ను సిద్ధం చేసుకున్నాడు. 
 
తన వెనుక నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్ వ‌స్తుండ‌గా దాన్ని ఓ చేతితో చూపిస్తూ ఫోజులిచ్చాడు. అయితే కథ అడ్డం తిరిగింది. అతని చేతిని రైలు ఢీకొట్టింది. దీంతో అదుపు తప్పి శివ కింద పడ్డాడు. ఈ ఘటనలో అతనికుడి చేతికి, త‌ల‌కి బ‌లంగా తాకింది. గాయ‌ప‌డ్డ‌ ఆ యువ‌కుడిని గుర్తించిన రైల్వే సిబ్బంది ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అత‌డి ప్రాణాల‌కు ప్ర‌మాదం ఏమీ లేద‌ని వైద్యులు వెల్లడించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

దాణా స్కామ్ : మూడో కేసులో కూడా లాలూ ముద్దాయే.. ఐదేళ్ళ జైలు

దాణా స్కామ్‌లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఇప్పటికే ...

news

స్మార్ట్‌ఫోన్ ద్వారా అశ్లీల చిత్రాలు-యువతి ఎంత పనిచేసిందో తెలుసా?

యువతులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇలాంటి కేసుల్లో నిందితులకు ...

news

విలువైన రాయి అనుకుని ఫ్రిజ్‌లో పెట్టారు.. ఆపై యాక్ అని వాంతులు చేసుకున్నారు.. ఎందుకు?

ఢిల్లీ విమానం నుంచి కింద పడిన మానవ వ్యర్థాన్ని ఉల్కా శకలంగా భావించి ఫ్రిజ్‌లో పెట్టారు ఓ ...

news

పవన్ కళ్యాణ్‌ కారుపై చెప్పు విసిరిన అగంతకుడు

ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టిన జనసేన పార్టీ ...

Widgets Magazine