Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఐదేళ్ల సహజీవనం... పెళ్లి మాటెత్తగానే పరార్

సోమవారం, 22 జనవరి 2018 (10:51 IST)

Widgets Magazine

ఐదేళ్ళ పాటు సహజీవనం చేస్తూ వచ్చిన వ్యక్తి పెళ్లి మాటెత్తగానే పారిపోయేందుకు ప్రయత్నించిన వ్యక్తిని హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూల్ జిల్లా కొలిమిగండ్ల మండలం బి.తాడిపత్రి గ్రామానికి చెందిన పాపగారి సురేష్ (27) రహ్మత్‌నగర్‌లో నివాసం ఉంటూ అమీర్‌పేటలోని ఓ రియల్‌ఎస్టేట్ సంస్థలో పని చేస్తూ వచ్చాడు. 
 
అదేసంస్థలో పనిచేస్తున్న మహిళ (36)ను ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. అప్పటికే పెళ్లయి భర్తతో విడిపోయిన మహిళ దీనికి అంగీకరించింది. 2012 నుంచి రహ్మత్‌నగర్‌లో గది అద్దెకు తీసుకుని వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. 2014లో వీరికి బాబు పుట్టగా పెళ్లి చేసుకున్న తర్వాతే పిల్లలను కందామని అప్పటిదాకా ఉద్యోగంలో డబ్బులు సంపాదిద్దామని సురేష్ నమ్మబలికి పుట్టిన వెంటనే బాబును రూ.40వేలకు విక్రయించేశాడు. 
 
యేడాది తర్వాత పాప పుట్టగా ఆమెను కూడా అదేవిధంగా వేరొకరికి అమ్మారు. ఇదిలావుండగా గత ఏడాది అగస్టునుంచి మహిళకు ముఖం చాటేసిన సురేష్ పెళ్లి చేసుకునేది లేదంటూ తేల్చిచెప్పాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకుండా తప్పించుకు తిరుగుతుండడంతో మోసపోయినట్లు గుర్తించిన మహిళ తాను దళితురాలినని కాబట్టే పెళ్లికి అంగీకరించడం లేదని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు సురేష్‌ను అరెస్టు చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పర్మిషన్ లేకుండా మహిళ శరీరాన్ని తాకరాదు : ఢిల్లీ కోర్టు

పర్మిషన్ లేకుండా మహిళ శరీరాన్ని తాకరాదని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. మహిళ శరీరం ఆమె ...

news

అక్రమ సంబంధం.. ఖాఖీలు ఇలా రోడ్డున పడ్డారు..

రక్షణ కల్పించాల్సిన పోలీసులే రోడ్డున పడ్డారు. తన భార్యతో కల్వకుర్తి సీఐ మల్లికార్జున్ ...

news

నేటి నుంచి పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ

జనసేనాని, పవర్ స్టార్ కళ్యాణ్ రాజకీయ యాత్ర సోమవారం నుంచి ప్రారంభంకానుంది. పవన్ కళ్యాణ్ ...

news

ప్రేమలో పడిన కలెక్టర్ ... 18న జూనియర్ ఐపీఎస్‌తో పెళ్లి

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న అమ్రపాలి ప్రేమలో పడ్డారు. తనకంటే చిన్నవాడైన ఐపీఎస్ ...

Widgets Magazine