Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

యువతి వెంటపడిన ట్రాఫిక్ పోలీసులు.. ఎందుకు.. ఎక్కడ..?

బుధవారం, 17 జనవరి 2018 (15:56 IST)

Widgets Magazine
drunk and drive

హైదరాబాద్ హైటెక్ సిటీలో మగవారి కన్నా ఆడవారే ఎక్కువగా మద్యం సేవిస్తున్నట్లున్నారట. అది కూడా పట్టపగలే ఫుల్‌గా మద్యం సేవించి మరీ యువతులు వాహనాలను నడిపేస్తున్నారు. ఇక రాత్రి వేళల్లో అయితే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. మోతాదుకు మించి తాగడమే కాకుండా ఇష్టం వచ్చినట్లు వాహనాలను రోడ్లపైన రయ్‌మని దూసుకెళుతున్నారు. గత కొన్నిరోజులకు ముందు ఏకంగా ఒక టాప్ యాంకర్ పట్టుబడి చివరకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత ఎలాగోలా ఆ కేసు నుంచి బయటపడి కౌన్సిలింగ్ తీసుకొన్నారు ఆ యాంకర్.
 
ఆ తర్వాతి నుంచి హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ను పక్కాగా నిర్వహించేస్తున్నారు. మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్‌లో ఒక యువతి ఫ్లూటుగా మద్యం సేవించి ఎంచక్కా కారు నడుపుకుంటూ వెళుతోంది. ట్రాఫిక్ పోలీసులు కారును ఆపినా ఆపలేదు. కొంతదూరం వెళ్ళాక కారు ఆపింది. మేడం.. బ్రీత్ ఎనలైజింగ్ చేయాలి.. గాలి ఊదండి అంటూ మిషన్‌ను పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నించగా ఏయ్.. ఎవరనుకున్నావు.. నన్నే చెక్ చేస్తారా అంటూ కారు డోర్‌ను గట్టిగా తోసి మెల్లగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళింది. అరకిలోమీటర్ వరకు నడుచుకుంటూనే ఆ యువతి రోడ్డంతా తిరిగింది. 
 
ఆ యువతి వెంట ట్రాఫిక్ పోలీసులు పడ్డారు. చివరకు ఆ యువతి వెనక్కి తగ్గి బ్రీత్ ఎనలైజింగ్ చేయించుకుంది. మోతాదుకు మించి మద్యం సేవించడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమె కారును స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఒక ప్రైవేట్ ఐటీ కంపెనీలో ఆ యువతి పనిచేస్తున్నట్లుగా ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Hyderabad Women Traffic Police Drunk And Drive Tests

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఏపీలో ఆ సీట్లు నాకొదిలేయ్.. ప్రధాని మాటలతో బాబు షాక్

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోడీ ఏదో ఒక షాక్ ...

news

మీడియా పేరుతో బెదిరింపులు.. సీసీ కెమెరాతో చిక్కుకున్నారు..

మీడియా పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లాలో ...

news

టాయ్‌లెట్ దానం చేయమంటున్న ఐఏఎస్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ పథకానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ...

news

సంక్రాంతి కోడి పందేలు.. రూ.400 కోట్లు చేతులు మారాయట?

సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్ర ప్రజలు అట్టహాసంగా జరుపుకున్నారు. భోగి, సంకాంత్రి, కనుమ ...

Widgets Magazine