Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

యాంకర్‌కు వేధింపులు- పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి.. చివరికి?

శుక్రవారం, 26 జనవరి 2018 (10:39 IST)

Widgets Magazine
victim woman

టీవీ యాంకర్‌కు వేధింపులు తప్పలేదు. వేరొక వ్యక్తితో వివాహం జరిగినా ఆ యాంకర్‌ను ఓ వ్యక్తి వేధించాడు. పెళ్లి చేసుకోమని కార్యాలయానికే వచ్చి ఒత్తిడి చేశాడు. చేసేది లేక ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఓ తెలుగు టీవీ చానల్ ఆఫీసుకు వెళ్లి, యాంకర్‌ను శ్రీకాకుళం జిల్లాకు చెందిన రవీందర్ (25) అనే యువకుడు వేధించాడు. నువ్వంటే ఇష్టమని చెప్పాడు. అయితే యాంకర్ మాత్రం అతనిని పట్టించుకోలేదు. తనకు పెళ్లైపోయిందని చెప్పింది. అయినా వేధింపులు ఆగలేదు. ఫలితంగా ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఇకపోతే.. టీవీలో సదరు యాంకర్‌ను నిత్యమూ చూస్తుండే రవీందర్, ఆమెను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో.. కార్యాలయానికి వచ్చి.. ఉద్యోగులందరూ చూస్తుండగానే తన కోరికను చెప్పాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. దీంతో అక్కడి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వచ్చి రవీందర్‌ను అరెస్ట్ చేశారు. 
 
కాగా, గత నాలుగైదేళ్లుగా రవీందర్‌కు, యాంకర్‌కు పరిచయం ఉంది కానీ.. రవీందర్ మాత్రం ఆమెను వివాహం చేసుకోవాల్సిందిగా 2014 నుంచి వేధిస్తున్నాడని పోలీసులు తెలిపారు. యాంకర్ తనకు వివాహమైందని చెప్పినా రవీందర్ పట్టించుకోలేదని.. అతని వద్ద విచారణ జరుపుతున్నామన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రిపబ్లిక్ డే స్పెషల్ : భారత రాజ్యాంగ రచనా భారమంతా ఎవరిదో తెలుసా?

మనకు 1947 ఆగష్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. అయితే వాస్తవానికి ఆ రోజు నుంచే పూర్తిగా ...

news

దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు: భద్రత వలయంలో హస్తినాపురి

దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్స వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని నగరం ...

news

శిల్పాల త‌యారీలో డిజిట‌ల్ టెక్నాల‌జీ... మంత్రి అఖిల ప్రియ‌ను క‌లిసి వివ‌రించిన శిల్పులు

అమ‌రావ‌తి: శిల్పాల త‌యారీలో ఇపుడు డిజిట‌ల్ టెక్నాల‌జీ ముఖ్య పాత్ర పోషిస్తోంద‌ని ...

news

ఫిబ్రవరి 1 నుంచి ఏపీలో నూతన భూమార్పిడి సవరణ చట్టం... ఏం జరుగుతుంది?

వచ్చే నెల ఫిబ్రవరి 1వ తేది నుంచి నూతన నాలా సవరణ చట్టం అమల్లోకి వస్తుంది. ప్రభుత్వం ...

Widgets Magazine