Widgets Magazine

పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చిందనీ ముగ్గురుని చంపేశాడు...

మంగళవారం, 30 జనవరి 2018 (10:38 IST)

Widgets Magazine
murder

హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన మూడు హత్య కేసుల్లోని మిస్టరీ వెలుగు చూసింది. ప్రేమ పేరుతో నమ్మించి సహజీవనం చేసి ఓ బిడ్డకు తండ్రయ్యాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో ఆమెతో పాటు.. కన్నబిడ్డనూ, ప్రియురాలి తల్లిని కూడా హత్య చేశాడు. ఈ దారుణం రంగారెడ్డి జిల్లా చందానగర్‌లో జరిగింది. తాజాగా వెలుగుచూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన గుడూరి జయమ్మ(50) అనే మహిళకు కుమార్తె అపర్ణాదేవి(33), కుమారుడు వంశీకృష్ణ ఉన్నారు. అపర్ణ అమ్మమ్మ ఊరు పాలకొల్లు మండలం ఉల్లంపర్రు. ఈ గ్రామానికి చెందిన రావాడ మధు హైదరాబాద్ కేపీహెచ్‌బీలో సెల్‌ఫోన్లు రిపేర్‌ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, అపర్ణ అమ్మమ్మ ఇంటికి వెళ్లివచ్చే సమయంలో మధుతో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. 
 
అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలున్నారన్న విషయాన్ని అపర్ణ వద్ద దాచిపెట్టిన మధు.. ఆమెతో సహజీవనం చేయసాగాడు. ఫలితంగా వీరికి పాప పుట్టింది. ప్రస్తుతం ఈ పాప వయసు ఐదేళ్లు. ఈ క్రమంలో చందానగర్‌లోని బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌లో ఎల్‌జీ ప్రమోటర్‌గా పనిచేస్తున్న అపర్ణ ప్రస్తుతం తన తల్లి, కుమార్తె కార్తికేయతో కలిసి జీవిస్తోంది. 
 
అయితే, రెండు రోజులుగా అపర్ణ ఉండే ఇంటి తలుపులు మూసి ఉండటంతో ఇంటి యజమాని నారాయణరావు అనుమానం వచ్చి వెనక వైపు కిటికీలో నుంచి చూడగా, హత్యకు గురైన అపర్ణ కాళ్లు కనిపించాయి. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం చేరవేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. తలుపులు పగులగొట్టి ఇంట్లోకెళ్లి చూడగా, మూడు శవాలను గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇందులోభాగంగా, అపర్ణ కాల్ డేటాతో పాటు.. స్థానికంగా ఉండే సీసీ టీవీ కెమెరాలను కూడా పరిశీలించారు. 
 
ఇందులో అసలు విషయం తెలిసింది. వెంటనే మధును అదుపులోకి తీసుకుని విచారించగా, అపర్ణతో తాను సహజీవనం చేస్తున్నానని, మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకనే హత్య చేశానని నిందితుడు పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలిసింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Shock Hyderabad Triple Murders

Loading comments ...

తెలుగు వార్తలు

news

వెస్ట్ బెంగాల్‌లో రోడ్డు ప్రమాదం.. 36 మంది మృత్యువాత

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు ...

news

పవన్ కళ్యాణ్‌ రహస్యంగా భేటీ అయిన ఆ 25 మంది పెద్దలు ఎవరు?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చడీచప్పుడుకాకుండా తన పార్టీని విస్తరిస్తున్నారు. ...

news

కలెక్టర్ ఆమ్రపాలి 'ఇట్స్ ఫన్నీ'పై తెలంగాణ సర్కారు సీరియస్

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి తెలుగులో ...

news

ప్రభుత్వ ప్రకటనలు ‘సాక్షి’కి ఇవ్వకండి... ఎందుకంటే?

ఐ అండ్ పీఆర్ కమిషనర్‌కు టిడీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వర్ల రామయ్య వినతి పత్రం ...