Widgets Magazine

టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా సతీమణి సుజాతపై కేసు

విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా సతీమణి సుజాతపై పోలీసులు కేసు నమోదు చేశారు. భూ వివాదమే ఇందుకు కారణమని తెలుస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుల భూమిని తప్పుడు పత్రాలతో ఎమ్మెల్యే అనుచరులు రిజిస్టేషన్ చేయించు

bonda umamaheswara rao
selvi| Last Updated: ఆదివారం, 28 జనవరి 2018 (17:31 IST)
విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా సతీమణి సుజాతపై పోలీసులు కేసు నమోదు చేశారు. భూ వివాదమే ఇందుకు కారణమని తెలుస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుల భూమిని తప్పుడు పత్రాలతో ఎమ్మెల్యే అనుచరులు రిజిస్టేషన్ చేయించుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

బాధితులు ఫిర్యాదు చేయడంతో సీఐడీ అధికారులు దర్యాప్తు మొదలెట్టారు. ఈ క్రమంలో సుజాతతో పాటు మరో 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, గతంలో విజయవాడ నగరంలో ఓ భూ ఆక్రమణకు సంబంధించిన వ్యవహారంలో బోండా ఉమా ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా, మరో భూవివాదంలో బోండా ఉమ సతీమణిపై కేసు నమోదుకావడం సంచలనానికి దారితీస్తోంది.

అయితే అయితే, ఈ ఆరోపణలను ఎమ్మెల్యే బోండా ఉమ కొట్టి పారేశారు. తనపై, తన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. అబ్దుల్ మస్తాన్ అనే వ్యక్తి నుంచి రవితేజ బయోటెక్ అనే కంపెనీ డైరెక్టర్‌గా ఉన్న తన భార్య సుజాత పేరు మీద డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ రాయించుకుని తీసుకున్నట్లు బోండా ఉమ చెప్పారు.

భూమి ఎవరిదో తమకు తెలియదని.. దీనికి సంబంధించి సురేష్, మస్తాన్‌ల మధ్య వివాదం నడుస్తుందన్నారు. ఈ వివాదం గురించి తెలియరావడంతో డెవలప్‌మెంట్ కోసం తీసుకున్న అగ్రిమెంటును కూడా రద్దు చేసుకున్నామని బోండా ఉమ వివరణ ఇచ్చారు.


దీనిపై మరింత చదవండి :