శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 5 డిశెంబరు 2023 (14:18 IST)

Cyclone Michuang బాపట్ల తీరాన్ని తాకిన మిచౌంగ్ తుఫాన్, ఈదురుగాలులతో అతిభారీ వర్షం

cyclone
కొద్దిసేపటి క్రితం Cyclone Michuang మిచౌంగ్ తుఫాన్ బాపట్ల సూర్యలంక తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీరం దాటుతున్న సమయంలో బలమైన గాలులతో సహా సముద్రం అలలు 2 మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. అతి భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షాలకు చేతికి వచ్చిన పంట నేలపాలవుతోంది.
 
గాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలుతున్నాయి. మరోవైపు వేల ఎకరాల్లో వరికోతలు కోసారు. అవన్నీ నీటిపాలవుతున్నాయి. కోతకు వచ్చిన పంట సైతం గాలుల ధాటికి దెబ్బతింటున్నాయి. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లుతోంది.