మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 23 అక్టోబరు 2020 (22:21 IST)

రఘురామరాజుకు పగలు విగ్గు.. రాత్రి పెగ్గు: వైసిపీ ఎంపి సెటైర్లు

వైసీపీ పార్టీ, ప్రభుత్వం మీద తనదైన శైలిలో విరుచుకుపడుతున్న రఘురామకృష్ణ రాజుపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్ సెటైర్లు విసిరారు. ‘రఘురామ‌కృష్ణ‌ రాజు గురించి మాట్లాడుకోవ‌డం సుద్ద దండగని, ఆయనకు ప‌గ‌లు విగ్గు - రాత్రి పెగ్గు’ అంటూ విమర్శలు చేశారు.
 
ఇటీవల రఘురామకృష్ణరాజు నోట్లో ఒక విదేశీ యువతి షాంపేన్ పోస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైసీపీ సానుభూతిపరులు అభిమానులు ఆ ఫొటోను ఆధారంగా చేసుకుని రఘురామకృష్ణరాజును ట్రోల్ చేశారు. మరి నందిగం సురేష్  వ్యాఖ్యలపై రఘురామ రాజు రచ్చబండలో ఏం మాట్లాడతారో చూడాలి.