Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మీరు బీటెక్, ఎంసీఏ పూర్తి చేశారా? ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా?

సోమవారం, 14 మే 2018 (20:49 IST)

Widgets Magazine

మీరు బీటెక్, ఎంసీఏ పూర్తి చేశారా? ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? మీ చదువుతోపాటు లేటెస్ట్ టెక్నాలజీల్లో మరింత నైపుణ్యం పెంచుకోవాలన్న ఆసక్తి ఉందా? అయితే మీలాంటి వారి కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పిస్తోంది. ఇంజనీరంగ్, ఎంసీఏ పూర్తి చేసిన అభ్యర్థులను అత్యంత నైపుణ్యవంతులుగా తీర్చిదద్దడం కోసం ప్రభుత్వం ఆంధ్రప్రేదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఆధ్వర్యంలో సమ్మర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ పేరుతో నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 
AP
 
ఇంజనీరింగ్ లోని అన్ని విభాగాలకు చెందిన వారితోపాటు ఎంసీఏ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఈ సర్టిఫికేషన్ ట్రైనింగ్స్‌కు హాజరవచ్చు. మార్కెట్లో అత్యుత్తమ సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్న ఉడాసిటీ నానోడిగ్రీస్, గూగుల్, అమెజాన్, ఆటో డెస్క్ అండ్ డస్సాల్ట్, కోర్స్ విత్ యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ లాంటి సంస్థలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కలిసి పనిచేస్తోంది.
 
మార్కెట్లో శిక్షణ ఇచ్చే రేటు కంటే అత్యంత తక్కువ ఖరీదుతో అభ్యర్థులకు లేటెస్ట్ టెక్నాలజీల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ఎపిఎస్‌ఎస్‌డిసి నిర్ణయించింది.  ఉడాసిటీ నానో డిగ్రీస్‌లో మెషీన్ లెర్నింగ్, ఆండ్రాయిడ్ డెవలపర్, ఫ్రండ్ ఎండ్, ఇంట్రడక్షన్ ఆఫ్ ప్రోగ్రామింగ్, ఫుల్ డెస్క్ లాంటి కోర్సులు  నేర్చుకోవాలంటే మార్కెట్లో 35 వేల నుంచి 60 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎపిఎస్‌ఎస్‌డిసి ఆధ్వర్యంలో ఈ కోర్సులకు కేవలం 6 వేల రూపాయల ఫీజుతో ట్రైనింగ్ ఇవ్వనుంది. 
 
ఇక అమెజాన్ కోర్సులకు సంబంధించి అనలిటిక్స్ & బిగ్ డాటా, క్లౌడ్ ఆర్కిటెక్ట్స్, ఆపరేటర్స్/సపోర్ట్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంజనీర్ విభాగాల్లోని సర్టిఫికేషన్ కోర్సులను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ఎపిఎస్‌ఎస్‌డిసి అధికారులు తెలిపారు.  వీటితోపాటు మరిన్ని విభాగాల్లో శిక్షణ పొందడానికి బీటెక్, ఎంసీఏ ఉత్తీర్ణులై.. శిక్షణ పొందాలన్న ఆసక్తి ఉన్న వారు engineering.apssdc.in/certification/లో వారి అర్హతలతోపాటు ఇతర వివరాలను నమోదు చేసుకోవాలని ఎపిఎస్‌ఎస్‌డిసి అధికారులు సూచించారు. శిక్షణతోపాటు ఇతర సమాచారాన్ని అభ్యర్థుల ఈమెయిల్స్‌కు పంపుతామని వారు తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చాడు.. ఐదేళ్ళ చిన్నారిని రెండునెలలు అనుభవించాడు..

చిత్తూరు జిల్లాలో మరో దాచేపల్లి సంఘటన జరిగింది. ఐదేళ్ళ చిన్నారిపై రెండునెలల పాటు ...

news

జగన్ మోహన్ రెడ్డి 2000 కి.మీ పాదయాత్ర, తూర్పు నియోజకవర్గంలో యలమంచిలి రవి పాదయాత్ర

రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకొని వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయటం కోసం పాదయాత్ర ...

news

శ్రీవారి చెంత నుంచి శెట్టిపల్లి గ్రామానికి పవన్ కళ్యాణ్.. ఎందుకు?

పవన్ తన పవర్ పాలిటిక్స్‌ను మొదలుపెట్టారా. ప్రజాసమస్యలపై ప్రత్యక్ష పోరాటానికి ...

news

ఎపిలో పార్టీ పరువు పోగొట్టారు - అధిష్టానంపై పురంధరేశ్వరి అలకపాన్పు?

భారతీయ జనతా పార్టీ అధిష్టానంపై అలకబూనారు మాజీ కేంద్రమంత్రి పురంధరేశ్వరి. పార్టీ నుంచి ...

Widgets Magazine