Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఉద్ధానం తర్వాత కనిగిరిలోనే ఆ సమస్య ఎక్కువ... ఎమ్మెల్యే కదిరి బాబురావు

సోమవారం, 13 నవంబరు 2017 (18:21 IST)

Widgets Magazine
MLA BabuRao

అమరావతి: శాసనసభలో కిడ్నీ బాధితులపై చర్చ జరిగినట్లు కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు చెప్పారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద సోమవారం ఉదయం ఆయన మాట్లాడారు. ఉద్ధానం తరువాత కనిగిరి ప్రాంతంలోనే కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కవగా ఉన్నందునే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.  2015 జూన్ నుంచి 2017 జూలై వరకు ప్రకాశం జిల్లాలో 345 మంది కిడ్నీ బాధితులు చనిపోయినట్లు చెప్పారు.
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ప్రకాశం జిల్లాలో చీరాల, కందుకూరు, మార్కాపురం, కనిగిరి మొత్తం 5 చోట్ల డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ నియోజకవర్గంలోని డయాలసిస్ సెంటర్లో షిప్టుల పద్ధతిపైన రోజుకు 30 మందికి టెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. కిడ్నీ బాధితులకు వైద్యం అందజేయడానికి ప్రభుత్వం రూ.5 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు, అలాగే వారికి నెలకు రూ.2500ల పెన్షన్ అందజేస్తున్నట్లు వివరించారు. 
 
ప్రైవేటు ఆస్పతులలో టెస్ట్ చేయించుకున్నవారికి కూడా పెన్షన్ ఇవ్వాలని కోరామని, అందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఫ్లోరైడ్ రహిత నీటిని సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో కొన్ని ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశారని, మరో ఏడాదిలో అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారని ఎమ్మెల్యే బాబురావు చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మహిళ అకౌంట్ లోకి రూ.125 కోట్లు.. ఏం చేసిందంటే...

చేతిలో చిల్లిగవ్వ లేకప్పుడు ఎవరైనా అప్పు ఇస్తే బాగుండు అనుకుంటాం. అలా జరుగకుండా మన ...

news

ఫిలిప్పీన్స్‌లో పారతో మట్టిని తీసి రామాయణాన్ని తిలకించిన మోడీ...

ఫిలిప్పీన్స్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజీగా ఉన్నారు. లాస్ బానోస్ నగరంలో ఇంటర్నేషనల్ ...

news

షాకింగ్... శశికళ ఆస్తుల తనిఖీ కోసం ఐటీ 160 కార్లు, వాటి అద్దె ఎంతో తెలుసా?

జయలలిత నెచ్చెలి, జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ ఆస్తులు తవ్వేకొద్దీ కోట్లలో తేలుతున్నట్లు ...

news

ప్రియుడి మృతి.. అతడి వారసుడిని కనాలనుకుంది.. సోషల్ మీడియాలో వైరల్

రోడ్డు ప్రమాదంలో ప్రియుడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆ ప్రేయసి అతనిని మరిచి.. కొత్త ...

Widgets Magazine