శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 21 మార్చి 2020 (15:58 IST)

ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఏపీలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత

ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. కరోనాపై ప్రధాని పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఈ అర్ధరాత్రి నుంచే నిలిపివేయనున్నట్టు చెప్పారు.

ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు కూడా సహకరించాలని కోరారు. "జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్ సర్వీసులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నాం . ఉదయం నుండి రాత్రి వరకు రాష్ట్రంలో  ఆర్టీసీ బస్సులను డిపోలకే పరిమితం చేస్తున్నాం.

ఈ రోజు రాత్రి నుండే దూర సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తున్నాం. ప్రైవేట్ సర్వీస్లను కూడా నిలిపి వేయమని కోరాం. రేపు రాత్రి నుండి సర్వీసులన్నింటినీ పునరుద్దిరిస్తాం. కరోనా వ్యాప్తి నివారణ చర్యలలో  భాగంగా ప్రధాని మోదీ స్వచ్చంద జనతా కర్ఫ్యూ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రయాణీకులంతా సహకరించాలి.

కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర సరిహద్దుల్లో ప్రైవేట్ వాహనాల రాకపోకలను నిలిపి వేసింది. కేవలం ఆర్టీసీ బస్సులకు మాత్రమే అనుమతిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రం నుండి తమిళనాడు వెళ్లే ప్రయాణీకులు తమ ప్రయాణాలు మానుకోవాలి" అని మంత్రి పేర్ని నాని కోరారు.