గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 12 జనవరి 2019 (11:37 IST)

వాజ్‌పేయి ఎక్కడ.. మోదీ ఎక్కడ? స్టాలిన్ ఎద్దేవా

దివంగత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయ్‌పై డీఎంకే అధినేత స్టాలిన్ ప్రశంసల వర్షం కురిపించారు. వాజ్‌పేయి‌తో ప్రధాని మోదీని పోల్చుకోవడంపై స్టాలిన్ స్పందించారు. మోదీ ఎప్పటికీ వాజ్‌పేయి కాలేరని చెప్పారు. వాజ్‌పేయి ఎక్కడ.. మోదీ ఎక్కడ అంటూ ఎద్దేవా చేశారు. 1999 ఎన్నికల్లో బీజేపీ, డీఎంకేలు కూటమిగా ఏర్పడినా.. మోదీ నాయకత్వంలో కూటమి ఏర్పడటం దేశానికి అంత మంచిది కాదని స్టాల్ వ్యాఖ్యానించారు. 
 
వాజ్‌పేయి హయాంలో ఎన్డీయే మంచి మనసుతో పని చేసిందని... మోదీ సర్కారు రాష్ట్రాల హక్కులను అణగదొక్కుతోందని విమర్శించారు. విభజన రాజకీయాలకు వాజ్‌పేయ్ ఎన్నడూ ప్రయత్నించలేదన్నారు. ప్రాంతీయ పార్టీలను వాజ్‌పేయి కలుపుకుని పోయారని.. ప్రస్తుతం బీజేపీ ప్రాంతీయ పార్టీలను అణగదొక్కేందుకు ప్రయత్నాలు సాగిస్తుందని స్టాలిన్ విమర్శలు గుప్పించారు.