శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 10 నవంబరు 2018 (12:10 IST)

డాక్టర్ శిల్ప.. సహకరించలేదు.. ఎండీ పరీక్షల్లో ఫెయిల్ చేశారట..

డాక్టర్ శిల్ప ఆత్మహత్యకు కారణమేమిటో సీఐడీ తేల్చేసింది. ఎస్వీ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ల లైంగిక వేధింపుల వల్లే.. డాక్టర్ శిల్ప ఆత్మహత్యకు పాల్పడిందని.. సీఐడీ తేల్చింది. ఈ మేరకు సీఐడీ మీడియాతో మాట్లాడుతూ.. డాక్టర్ శిల్పను ముగ్గురు ప్రొఫెసర్లు వేధింపులకు గురిచేశారని చెప్పారు. ఈ కేసులో నిందితులు జైలులోనే వున్నారని.. బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 
 
రవికుమార్, శశికుమార్, కిరీటీ అనే ముగ్గురు లైంగిక వేధింపులకు గురిచేశారని చెప్పారు. అంతేగాకుండా.. లైంగిక వేధింపులకు సహకరించకపోవడంతో డాక్టర్ శిల్పను ఎండీ పరీక్షల్లో ఫెయిల్ చేశారని ఈ సీఐడీ నివేదిక తేల్చింది. 
 
ఈ ఘటనకు సంబంధించి 47 మందిని విచారించినట్లు సీఐడీ తెలిపింది. కాగా తనను ప్రొఫెసర్లు లైంగికంగా వేధిస్తున్నారని డాక్టర్ శిల్ప గవర్నర్‌కు, ప్రభుత్వానికి ఈ ఏడాది ఏప్రిల్‌ 16వ తేదీన ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై విచారణ  చేసి బాధ్యులపై చర్యలు తీసుకొంటే డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకొనేది కాదని డాక్టర్ శిల్ప కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.