Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భార్యపై అనుమానంతో ఆమె గొంతుకోశాడు.. ఐదునెలల పసికందును కూడా?

సోమవారం, 1 జనవరి 2018 (11:09 IST)

Widgets Magazine
knife attack

భార్యపై అనుమానంతో ఆ భర్త కిరాతకుడిగా మారాడు. భార్యను, ఐదు నెలల పసికందును గొంతుకోసి హతమార్చాడు. ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్‌‌లో డిసెంబర్ 31న ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్,అదే జిల్లాలోని నస్పూర్ మండలం‌‌కు చెందిన బాలమ్మను ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. 
 
బాలమ్మ ఐదు నెలల క్రితం పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఇంతలో ఏమైందో ఏమో కానీ శ్రీనివాస్ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. భార్యను తనతో పంపించాలని ఆమె పుట్టింటికి వెళ్లి వేధించాడు. తాగి గొడవకు కూడా దిగాడు. దీంతో పెద్దలు జోక్యం చేసుకుని శ్రీనివాస్‌, బాలమ్మలకు నన్పూర్‌లో కాపురం పెట్టించారు.
 
అయితే శ్రీనివాస్‌లో భార్యపై అనుమానం తగ్గలేదు. అంతే ఆదివారం సాయంత్రం మద్యం సేవించి గొడవకు దిగాడు. భార్య వాదించడంతో కోప్రోదిక్తుడైన భర్త ఇంట్లో ఉన్న కత్తితో భార్య గొంతుకోసేశాడు. అనంతరం తల్లిపక్కనే పడుకుని ఉన్న పసికందును కూడా గొంతు కోసి చంపాడు. రక్తపుమడుగుల్లో విగతజీవిగా పడివున్న తల్లి కొడుకులను చూసిన స్థానికులు కంటతడి పెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న శ్రీనివాస్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ట్రంప్ వ్యాఖ్యల్లో వున్న అర్థమేమిటి? మధ్యంతర ఎన్నికలకు సంకేతాలిచ్చారా?

అమెరికన్లు స్మార్ట్ ఓటర్లని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. 2017కు వీడ్కోలు ...

news

పెళ్లి వేడుకలో తుపాకీ కాల్చారు.. తూటా పేలింది.. వరుడు మృతి

పెళ్లి ఇంట విషాదం నెలకొంది. సందడిగా జరుగుతున్న వివాహ మండపంలో పెళ్లి కొడుకే బలైయ్యాడు. ఈ ...

news

''ఇతడే నిజమైన బాహుబలి'' కేటీఆర్ ట్వీట్.. ఇంతకీ ఆయనెవరు?

తమిళనాడులోని ఫారెస్ట్ గార్డు శరత్ కుమార్‌పై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రశంసలు ...

news

మదర్సాలో బాలికపై అత్యాచారం- వేధింపులు.. 51మంది బాలికలకు విముక్తి

దేశంలో మహిళలపై వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని నగరం ఢిల్లీ, ...

Widgets Magazine