బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 ఆగస్టు 2021 (13:05 IST)

పులిచింత‌లలో భూప్ర‌కంప‌న‌లు - రిక్టర్ స్కేలుపైన 3గా నమోదు

పులిచింత‌ల స‌మీపంలో ఆదివారం ఉద‌యం వ‌రుస భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. ఆదివారం ఉద‌యం 7.15 నుంచి 8.20 గంట‌ల మ‌ధ్య భూమి ప్ర‌కంపించింది. ఈ ప్రకంపనల ప్రభావం కారణంగా రిక్ట‌ర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3, 2.7, 2.3 గా న‌మోదు అయింది. 
 
చింత‌ల‌పాలెం, మేళ్ల చెరువు మండ‌లాల్లో భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. గ‌త వారం రోజులుగా పులిచితంల స‌మీపంలో భూమి కంపించిన‌ట్లు భూభౌతిక ప‌రిశోధ‌న ముఖ్య శాస్త్ర‌వేత్త శ్రీ‌న‌గేశ్ వెల్ల‌డించారు.