సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 ఏప్రియల్ 2023 (18:18 IST)

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ.. బిడ్ వేసిన జేడీ

JD Lakshminarayana
విశాఖపట్నం ఉక్కు బిడ్డింగ్‌లో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ఆయన అవసరమైతే బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన ఓ ప్రైవేట్ సంస్థ తరపున బిడ్ వేశారు. రెండు సీల్డ్ కవర్‌లో బిడ్డింగ్‌కు అవసరమైన పత్రాలను జేడీ అందికారులకు అందజేశారు. 
 
ఈ సందర్భంగా జేడీ మీడియాతో మాట్లాడుతూ.. క్రౌడ్ ఫండింగ్ ద్వారా మూలధనం సేకరిస్తామని వెల్లడించారు. నాలుగు నెలల పాటు నెలకు రూ.850 కోట్లు ఇవ్వగలిగితే స్టీల్ ప్లాంట్ నిలదొక్కుకుంటుందని అధికారులు చెప్పారని వివరించారు. 
 
నాడు ఎన్టీఆర్ దివిసీమ ఉప్పెన, రాయలసీమ సంక్షోభం సందర్భంగా జోలె పట్టారని, అయితే ఇప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారాయని, ఇప్పుడన్నీ డిజిటల్ పేమెంట్లు వచ్చేశాయని జేడీ వివరించారు.