ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2019 (18:25 IST)

సింహం సింగిల్‌గానే వస్తోంది... అన్ని కేసుల్లో చింతమనేనికి బెయిల్

సింహం సింగిల్‌గానే వస్తుందని చింతమనేని అనుచరులు అంటున్నారు. ఎందుకంటే, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అయిన చింతమనేని ప్రభాకర్‌పై వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదికి పైగా కేసులు నమోదు చేసి, అరెస్టు చేయించింది. ఆ తర్వాత ఒక్కో కేసులో బెయిల్ లభించినప్పటికీ.. మరో కొత్త కేసు పెడుతూ జైల్లోనే ఉంచింది. ఈ క్రమంలో చింతమనేనికి అన్ని కేసుల్లో బెయిల్ మంజూరైంది. 
 
దీంతో ఆయన శనివారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన ఏలూరు జిల్లా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. చింతమనేనిపై దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మరోవైపు, చింతమనేనికి బెయిల్ మంజూరు కావడంతో ఆయన అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. సింహం సింగిల్‌గానే వస్తుందంటూ చింతమనేనికి అనుకూలంగా పోస్టర్లు, బ్యానర్లను భారీగా ఏర్పాటు చేస్తున్నారు.