Widgets Magazine

డాడీ... మిఠాయిలు కొనిస్తానని తోటలోకి తీసుకెళ్లి ముద్దులు పెట్టాడు...

బుధవారం, 12 సెప్టెంబరు 2018 (16:23 IST)

ఓ కామాంధుడు ఏడేళ్ళ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అదీ కూడా మిఠాయిలు కొనిచ్చి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆ కామాంధుడు ఎవరో కాదు.. కన్నతండ్రి. గుంటూరు జిల్లా తాడికొండలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
తాడికొండ గ్రామానికి చెందిన షేక్‌ నాగుల్‌ బీ అనే మహిళకు 7 సంవత్సరాల క్రితం గుంటూరు లక్ష్మీనారాయణపురానికి చెందిన షేక్‌ రహ్మల్‌ అనే వ్యక్తితో వివాహమైంది. అతనికి అప్పటికే ఒక వివాహం జరిగి భార్య మరణించగా మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. సైకో మనస్తత్వంతో కూడిన భర్త.. ఆది నుంచి ఇబ్బందులకు గురిచేస్తుండటంతో ఠాణాలో నాగుల్ బీ కేసు పెట్టి భర్తకు దూరంగా ఉంటోంది.
 
అయితే, ఇటీవల భార్యతో కాపురం చేసేందుకు వచ్చిన రహ్మల్‌ రెండు నెలలుగా తాడికొండలోనే ఉంటున్నాడు. ఈ నెల మూడో తేదీన పాఠశాల నుంచి వచ్చిన పెద్ద కుమార్తె (7)ను మిఠాయిలు కొనిపిస్తానంటూ బయటకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదేరోజు గుంటూరుకు వెళ్లిపోయిన భర్త ఇంటికి తిరిగిరాలేదు. మరుసటి రోజు పాఠశాల నుంచి వచ్చిన కుమార్తె కడుపు నొప్పి అంటూ బాధపడుతుంటే వేడి చేసి ఉంటుందని భావించిన తల్లి అంతగా పట్టించుకోలేదు. 
 
తరచూ నడుము నొప్పి, కడుపు నొప్పి అంటుండటంతో 10న గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లిన తల్లికి వైద్యులు బాలికపై లైంగిక దాడికి గురైందని చెప్పడంతో విస్తుపోయింది. ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లి తనిఖీ చేయగా, అసలు విషయం తెలిసింది. దీంతో నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బీజేపీ మినీ కాంగ్రెస్.. ముస్లింలకు మోడీ వకాల్తాదారు : తొగాడియా నిప్పులు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విశ్వ హిందూ పరిషత్(వీహెచ్ పీ) మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ ...

news

పెళ్లి చేస్కుంటావా? లేదంటే నీ భర్తను చంపమంటావా? ఏంటో చెప్పు నీ యవ్వారం...

ఓ ప్రేమోన్మాది బెదిరింపులకు వివాహిత వణికిపోయింది. తొలుత అతడి బెదిరింపులను లైట్ గా ...

news

పసికందు గొంతులో ఉప్పుపోసి చంపేసిన తల్లి.. ఎందుకో తెలుసా?

సాధారణంగా కన్నబిడ్డ ఏడిస్తే కన్నతల్లి తట్టుకోలేదు. తిరిగి ఆ బిడ్డ నవ్వేంత వరకు ఆ తల్లి ...

news

లగడపాటి షాకింగ్ సర్వే... తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమా...?

కాంగ్రెస్ పార్టీ ఎంపీ పదవికి రాజీనామా చేసి దాదాపుగా రాజకీయ సన్యాసం చేస్తున్న లగడపాటి ...

Widgets Magazine