సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 24 ఆగస్టు 2018 (12:12 IST)

పగలు ఒకరు.. రాత్రి ఒకరు... ఇద్దరు కుమార్తెలపై తండ్రి అత్యాచారం...

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కుమార్తెల శీలంపై కాటేశాడు. ఒక యేడాది కాలంగా ఇద్దరు కుమార్తెలపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కుమార్తెల శీలంపై కాటేశాడు. ఒక యేడాది కాలంగా ఇద్దరు కుమార్తెలపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
నేపాల్‌ దేశానికి చెందిన రాజ్ బహదూర్ అనే వ్యక్తి కుటుంబం రంగారెడ్డి రెడ్డి జిల్లా శంషాబాద్‌కు వలస వచ్చింది. రాజ్ బహదూర్ హైమద్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 
 
అయితే, వయసుకు వచ్చిన ఇద్దరు కుమార్తెలపై కన్నేసిన బహదూర్... భార్య లేని సమయంలో వారిని లోబరుచుకుని అత్యాచారం చేస్తూ వచ్చాడు. తాను పగలు ఇంట్లో ఉంటే ఓ కుమార్తెతో, రాత్రి ఇంట్లో మరో కుమార్తెతో అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. 
 
ఈ విషయాన్ని గమనించిన భార్య.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసున మోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధిత యువతుల వద్ద కూడా పోలీసులు జరిగిన వాస్తవాన్ని ఆరా తీస్తున్నారు.