శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 30 ఆగస్టు 2021 (09:53 IST)

జగనన్న చేదోడుతో ఆర్థిక చేయూత

వెనుకబడిన వర్గాల్లో కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీ(టైలర్)ల జీవన ప్రమాణాల పెంపే లక్ష్యంగా జగనన్న చేదోడు పథకం ద్వారా ఆయా వర్గాలకు ఏటా రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలుస్తున్నారు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి.

వృత్తికి అవసరమైన పనిముట్లు, చేతి పెట్టుబడి కోసం ఈ సాయం ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో జగనన్న చేదోడు పథకం ద్వారా సకాలంలో ఆర్థికసాయం అందించి ఆయా వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాసులు కాదు బ్యాక్ బోన్ క్లాసులుగా అభివర్ణించేలా చేశారు.
 
కొన్ని శతాబ్ధాలుగా చుట్టూ ఉన్న ప్రజలకు సేవ చేస్తూ కేవలం తమ చెమటను మాత్రమే నమ్ముకొని పనిచేస్తున్న గొప్ప మనుషుల కోసం జగనన్న చేదోడు పథకాన్ని ప్రవేశపెట్టానన్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అందుకు అనుగుణంగా రాష్ట్రంలో సొంత షాపు కలిగిన నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు 2020 జూన్ లో రూ.10 వేల చొప్పున తొలి విడత సాయంగా 2,47,040 మంది లబ్దిదారులకు రూ.247.04 కోట్లు వారి ఖాతాలో జమ చేశారు.

ఇందులో  82,347 మంది రజకులకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.82,34,70,000 సహాయం అందగా, 38,767 నాయీ బ్రాహ్మణులకు రూ.38,76,70,000 సహాయం, 1,25,926 మంది దర్జీలకు రూ.125,92,60,000 ఆర్థిక సహాయం అందించారు. లబ్ధిదారులకు గతంలో ఏదైనా రుణాలుంటే ఈ మొత్తం ఆ ఖాతా కింద బ్యాంకులు తీసుకోకుండా, బ్యాంకర్లతో ఇప్పటికే ప్రభుత్వం మాట్లాడి వాటిని అన్‌ఇన్‌ కమ్‌ బర్డ్‌ ఖాతాల్లో జమ చేయాలని సూచించడం జరిగింది.  
 
తాజాగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జగనన్న చేదోడు పథకం అక్టోబర్ లో ప్రారంభం కానున్న రెండో విడత కింద లబ్ధిదారులకు ఆర్ధిక సాయం అందించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. 
 
జగనన్న చేదోడు పథకానికి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తోన్న ప్రభుత్వం గ్రామ సభల్లో వారి చూపించి, మాట్లాడించి ఆ తర్వాత అర్హుల ఎంపిక చేస్తోంది ప్రభుత్వం. అనంతరం గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాలు ప్రదర్శిస్తోంది.

అర్హులై ఉండి కూడా పథకం ద్వారా పొరపాటున ఎవరికైనా లబ్ది జరగకపోతే అలాంటి వారు ఎటువంటి ఆందోళన చెందకుండా గ్రామ,వార్డు సచివాలయాల వద్దకు వెళితే అక్కడ ప్రదర్శించిన నిబంధనలకనుగుణంగా అర్హులు అని తేలితే సంబంధిత పత్రాలు గ్రామ సిబ్బంది, వాలంటీర్లకు అందజేస్తే విచారణ చేసి అర్హులుగా తేలితే వారికి కూడా లబ్ది చేస్తోంది ప్రభుత్వం.
 
ప్రభుత్వ పాఠశాలలు తెరిచే నాటికి, జగనన్న విద్యాకానుక ద్వారా లక్షలాది మంది విద్యార్థినీ విద్యార్థులకు అందించిన మూడు జతల యూనిఫామ్‌ కుట్టే అవకాశాన్ని కూడా దర్జీలకే అందజేయడం విశేషం. తద్వారా వచ్చిన కుట్టు కూలీతో దర్జీలకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం చేకూరింది. 
 
డబ్బులు ఎలా ఎగ్గొట్టాలన్నది కాదు, అర్హుడైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఎలా లబ్ధి చేకూర్చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వంపై లబ్దిదారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కుల, మత, ప్రాంత, వర్గాలకు అతీతంగా, రాష్ట్రంలో అర్హత కలిగిన, ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతుండటంతో ప్రతి ఒక్కరి కళ్లలో, కుటుంబాల్లో, జీవితంలో ఆనందం వెల్లివిరుస్తోంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 
 
వెనుకబడిన తరగతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కరోనా కష్టకాలంలో షాపులు తెరిచే పరిస్థితి లేక, ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ, జగనన్న చేదోడు ద్వారా ఆయా వర్గాలకు అండగా నిలబడి, వారి రోజూవారీ జీవితానికి ఎటువంటి ఆటంకం లేకుండా చేసి ఆపద్భాంధవుడి పాత్ర పోషించారని సాక్షాత్తు లబ్దిదారులు కొనియాడుతున్నారు.