సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 28 ఆగస్టు 2018 (08:55 IST)

సెలూన్‌ ముసుగులో ఇద్దరమ్మాయిలతో బాడీ టు బాడీ మసాజ్...

సెలూన్ మరియు స్పా సెంటర్ ముసుగులో తన వద్దకు వచ్చే కస్టమర్లకు ఇద్దరు అమ్మాయిలతో ఆ టైపు బాడీ మసాజ్‌ను గుట్టుచప్పుడుకాకుండా కొనసాగిస్తూ వచ్చిన బండారాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ కేసులో ఇద్దరు యువతులతో పా

సెలూన్ మరియు స్పా సెంటర్ ముసుగులో తన వద్దకు వచ్చే కస్టమర్లకు ఇద్దరు అమ్మాయిలతో ఆ టైపు బాడీ మసాజ్‌ను గుట్టుచప్పుడుకాకుండా కొనసాగిస్తూ వచ్చిన బండారాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ కేసులో ఇద్దరు యువతులతో పాటు నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు.
 
హైదరాబాద్ నగరంలోని బోయిన్‌పల్లిలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, బోయిన్‌పల్లికి చెందిన దురైరాజ్‌ గణేష్‌(35) అనే వ్యక్తి ఏఎస్‌రావు నగర్‌, అణుపురం కాలనీ ప్రధాన రహదారిలోగల రిలయన్స్‌ ఫ్రెష్‌ భవనంలోని మూడో అంతస్తులో ఓ స్పా సెంటర్‌ను ప్రారభించాడు. దీనికి ఫౌంటైన్ సెలూన్ అండ్ స్పా సెంటర్ అని పేరు పెట్టాడు. కానీ, సరైన అనుమతి తీసుకోలేదు. 
 
ఇక్కడకు ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను అద్దెకు తీసుకొచ్చి.. వారితో పురుషులకు మసాజ్‌ చేయించసాగాడు. ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా కొన్ని నెలలుగా సాగుతూ వచ్చింది. పైగా, ప్రత్యేక వెబ్‌సైట్‌ ఒకదాన్ని ప్రారంభించి అందులో అందమైన అమ్మాయిల ఫొటోలను అప్‌లోడ్ చేసేవాడు. 
 
ఇలా వినియోగదారులను ఆకర్షిస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ వచ్చాడు. దీనిపై పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు కూడా కస్టమర్లుగా మసాజ్ సెంటర్‌కు వెళ్లారు. వారికి కూకట్‌పల్లికి చెందిన ఓ యువతి(25)తో మసాజ్‌ చేయించే ప్రయత్నం చేయగా నిర్వాహకుడు, ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1500, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని కుషాయిగూడ పోలీసులకు అప్పగించారు.