ఎల్లసిరి చెరువుకు చేరిన "గంగ" జలాలు
నాడు చిట్టమూరు మండలం ఎల్లసిరి చెరువును రిజర్వాయర్ చేసి తద్వారా దిగువ ప్రాంతాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యం, దశాబ్దాల కలకు వైకాపా నాయకులు ఆధ్వర్యంలో ఎల్లసిరి చెరువుకు నేడు గంగనీరు చేరడంపై రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తీవ్ర వర్షాభావం, ఆఖరి తడికి నీరు అందక రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు, సాగునీటి సమస్యలతో ఏటా నిద్రెరగని రాత్రులు ,పెరిగిన పెట్టుబడులు, రైతాంగం ఎదుర్కొన్న ఏళ్ళనాటి శ్రమకు ఊరట లభించనుంది.
మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిరూపించుకున్న వైసిపి తెలుగుగంగ జలాలను తెప్పించడంలో క్రియాశీలకంగా ఎల్లశిరి పంచాయితీ నాయకులు సుకుమార్ రెడ్డి,రైతాంగం పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కనుంది. గంగ ఉన్నతాధికారులతో, ప్రజాప్రతినిధులతో, స్థానిక ఎమ్మెల్యేతో చర్చించి గంగ జలాలను చెరువుకు తీసుకువచ్చేందుకు అలుపెరుగక పని చేసిన నాయకులను రైతాంగం అభినందిస్తున్నారు.శనివారం రాత్రి ఎల్లసిరి ఎగువ గిరిజన కాలని వద్ద గంగ జలాలకు హారతులిచ్చి పూజలు నిర్వహించారు.